కవిత

కవిత

శీర్షిక: నియంతపాలన

దోపిడి దగా దౌర్జన్యం
నీళ్ళు నిధులు ఉద్యోగం
అంటూ
తెలంగాణ యావత్తు 
గొంతెత్తన గళాలు
నేడు ఒక్కో హక్కును కోల్పోతూ
నిస్సహాయ స్థితిలో 
ఏంతోచక 
తప్పుకు శిక్షననుభవిస్తున్నది
జయశంకరుడి ఆలోచనను
ఓ యమకింకరుడికి ధారవోసే
మావి మాగ్గావలంటూ
స్థానికతనడ్డుపెట్టుకొని
ఏర్పాటొచ్చిన రాష్ట్రంలో
పాలనంతా తుగ్లక్ చేతుల్లో 
ఏ క్షణం ఏంజరుగుతుందో తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిత్రం
ఉద్యమానికో ఊపుతెచ్చిన ఉద్యోగులకు నిరుద్యోగులకు
భంగపాటే బహుమతి
జయశంకర్ సిద్దాంతం
దొరల చేతుల్లో కుతంత్రం
దినదినం అదో రాద్దాంతం

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments