చిరస్మరణీయుడు - మన పి వి -జరుగుమల్లి.వీరయ్య

చిరస్మరణీయుడు - మన పి వి -జరుగుమల్లి.వీరయ్య


అంశం: పి వి నరసింహారావు వర్ధంతి సందర్భంగా..

కవితా శీర్షిక : చిరస్మరణీయుడు - మన పి వి
రచయిత : జరుగుమల్లి వీరయ్య 

    చిరస్మరణీయుడు - మన పి వి

రుక్నాబాయి సీతారామారావు ఆదర్శ దంపతుల ముద్దుల తనయుడు
పాములపర్తి రుక్మిణమ్మ రంగారావు ఆదర్శ దంపతుల దత్తపుత్రుడు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వంగర వరపుత్రుడు... మన పి వి నరసింహారావు.
చిన్ననాటి నుండి చక్కటి క్రమశిక్షణ,
ఉత్తమోన్నత సంకల్ప లక్ష్యం,
ఆడంబరము లేని నిరాడంబరం,
నైతిక విలువలు, ఎదిగిన కొద్ది
ఒదిగి ఉండే మనస్తత్వం - మన పివి సొంతం.
ఉస్మానియా యూనివర్సిటీ లో  ఉన్నత విద్యను అభ్యసించిన న్యాయవాది,
అక్షర సేద్యం లో గొప్ప గొప్ప రచనలు పండించిన గొప్ప సాహితీవేత్త,
పలు భాషల పై పట్టు సాధించిన బహు భాషా కోవిదుడు,
దేశాభివృద్ధికి భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి,
నిజాం రాజ్య ప్రభుత్వాన్ని ఎదిరించిన తెలుగు వీరుడు,
వందేమాతరం గేయం ఆలపించిన సింహస్వప్నం
వివిధ పత్రికలలో జర్నలిస్టుగా సంపాదకునిగా రాణించిన గొప్ప రచయిత - మన పి వి
రాజకీయ జీవితంలో. శాసనసభ్యుడిగా.. రాష్ట్ర మంత్రిగా.. ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిగా.. భారతదేశం ప్రధానమంత్రి గా..గల పదవులకు వన్నెతెచ్చిన అపర చాణిక్యుడు - మన పి వి.
ఉద్యమాల ఊపిరితో మమేకమైన జీవనం
హంగు ఆర్భాటాలు లేని నిరాడంబర జీవితం
అవినీతి మరకలంటని స్వచ్ఛమైన తెలుగు తేజం
అధికార సంద్రంలో మైనారిటీ ప్రభుత్వ నావని రాజనీతిజ్ఞతతో తీరందాటించిన చుక్కాని
సమయోచిత కార్య చరణాల స్థితప్రజ్ఞత అపారం
దక్షిణాది రాష్ట్రంలో తొలి తెలుగు ప్రధానామాత్యులు - మన పి వి.
ఉత్తమ భవితకు గతి మార్చిన గొప్ప సంఘ సంస్కర్త
చెరగని ఆర్థిక సంస్కరణల గొప్ప అపర మేధావి
పదవి వచ్చినాడు పొంగిపోలేదు
పీఠం దిగినాడు కుంగిపోలేదు
తామరాకు మీద నీటి బిందువులా కనిపించే అపార సింధువు
పుస్తక ప్రియుడు,
నడిచే గ్రంథాలయ అంతర్ముఖుడు, బహుముఖ ప్రజ్ఞావంతుడు, చిరస్మరణీయుడు - మన పి వి నరసింహారావు.

హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.

 

0/Post a Comment/Comments