గణితమన్నదిలేక ఘణతలేలా ( కైతికాలు)రమేశ్ గోస్కుల

గణితమన్నదిలేక ఘణతలేలా ( కైతికాలు)రమేశ్ గోస్కుల

అమ్మ ఒడిలో మొదలు
ఆయువుడుగువరకు
ఉదయకాంతులనుండి
నిద్రమునుగు వేళకు
గణిత మన్నది లేక
ఘణతేలా కలుగును

భక్తి చూపుటైనా
భుక్తి తీరుటకైనా
శక్తినందుట నైనా
యుక్తి పన్నుటకైనా
గణిత మన్నది లేక
గడపేలా దాటును గడుసుబుర్ర

గగనాంతరాలను
దాటి వెళ్ళుటకును
గంగలోతులు చూపి
గండములు బాపుటకును
వారధౌను కదా !
గణన తోడనే నేడు

పండితా పామరులు
చిన్న పెద్దయు నంత
యెన్ని పనులనైనా
సాగించు ఘణ చరిత
బుద్ధి తెలిసి నడవరా
గణితమే గమ్యమగు

నిర్మాణమునకును
నిప్పు వాడకమైనా!
వాహనాలకు నైనా
వంటింటి వన్నెకైనా!
లెక్కలన్నవి లేక
రుచులేల జిహ్వ నదురు

హితులు మిత్రులకు సకల
కవులు కవయిత్రులకు
శాస్త్రమేదైనను
బోధించు గురువులకు
గణిత దినంబున
ఘణమైన కాంక్షలివె

శ్రీనివాస రామానుజన్  గారి జన్మదిన సందర్భంగా ...
గణిత దినోత్సవ శుభాకాంక్షలతో💐💐💐💐💐💐💐💐💐💐💐💐
భువన సాహిత్య విజ్ఞాన వేదిక తెలంగాణ వారి శుభాకాంక్షలతో....

రమేశ్ గోస్కుల 
కైతికాల రూపకర్త.

0/Post a Comment/Comments