గీత రాసిన నుదిటి రాత - దొడ్డపనేని శ్రీ విద్య

గీత రాసిన నుదిటి రాత - దొడ్డపనేని శ్రీ విద్య

భగవద్గీత - మహోత్సవం

గీత చెప్పిన జీవిత పాఠం


ప్రేమ లేని మనిషి ఉండడు.
గాయం తగలని గుండె ఉండదు.
ఆశలకు హద్దు ఉండదు. 
జ్ఞాపకాలకు అంతు ఉండదు.


అయ్యిందేదో మంచికే అయ్యింది. అవుతున్నదేదో అదీ మంచికే అవుతుంది. అవ్వబోయేదేదో కూడా మంచికే అవుతోంది. నీవేమి పోగొట్టుకున్నావని నీవు విచారిస్తున్నావ్ ? నీవేమి తెచ్చావని నీవు పోగొట్టుకుంటావ్ ? నీవేమి సృష్టించావని నీకు నష్టం వాటిల్లింది. నీవు ఏదైతే పొందావో అది ఇక్కడ నుండే పొందావు. ఏదైతే ఇచ్చావో ఇక్కడే ఇచ్చావు. ఈరోజు నీవు,  నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కదా ! మరి అదే , రేపు మరొకరి సొంతం కాగలదు.
ఇదే కదా  గీతాసారం

పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ. పరివర్తనను ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి.
ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస

నిజాయితీగా ఉండడం కూడా  ఒక్క యుద్ధం లాంటిదే..
యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో...సమాజంలో.. అంతకన్నా ఎక్కువ కష్టం..
మనుషుడై పుట్టి ప్రయోజనం ఏమిటి ? జ్ఞానం లేకపోతే
హృదయం ఉండి ప్రయోజనం ఏమిటి ? దయ లేకపోతే ధనికుడైతే మాత్రం ప్రయోజనం ఏమిటి ? దానం చేయకపోతే ప్రయోజనమేమిటి ?చదివితే ప్రయోజనం ఏమిటి ? శాంతి లేకపోతే ప్రయోజనం ఏమిటి ?
 ప్రేమ గా మాట్లాడకపోతే మనసుండి ప్రయోజనం ఏమిటి ? మాధవుడ్ని తలచకపోతే ఇంక జీవితానికి ప్రయోజనమేమిటి ?

 జీవితమే ఓ యుద్ధ రంగం. పోరాడి గెలవాలి.
నీ ప్రయత్నం ఆపనంత వరుకూ నువ్వు ఓడిపోనట్లే లెక్క.
 అదియే భగవద్గీత మనకు నేర్పిన జీవిత పాఠం

కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరకుతుంది.

మన చేతిలోనే కాలం ఉంటుంది..
అందుకే వృధా చేయకుండా
జాగ్రత్తగా వాడుకోవాలి.
నువ్వు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు...

నీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు... రాలేదని కృంగిపోకు... వచ్చిందని పొంగిపోకు... జరిగేవన్నీ నీ కర్మలో భాగమే కానీ...! జరిపించేదంతా భగవంతుడే...! వంద తప్పులు చేసినవాడినైన మన్నించవచ్చు కానీ, ఒక్క సారి మోసం చేసిన వాడిని క్షమించకూడదు. తప్పులు చేసేవాడు అయిన మారుతాడేమో కానీ మోస బుద్ధి ఉన్నవాడు మారడు.

 చదువ రానివాడికి పుస్తకం ఇచ్చినా....  మనస్సు లేని వాడికి ప్రేమను పంచినా.... రెండు వ్యర్థమే. ఎందుకంటే...
వాడు పుస్తకం లోని బొమ్మలు చూస్తాడే తప్ప అందులోని విషయాన్ని చదువలేడు. ఇంకొకరు మనిషి యొక్క ఆకారం చూస్తారే తప్ప తనలోని ప్రేమను గ్రహింపలేరు..!!


నిత్య సంఘర్షణతో సతమతమయ్యే మానవుని మనస్సే ఒక కురుక్షేత్రం. శరీరమే రథం. దానిని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు.
సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు. 
చూపే బుద్ధి, పరిష్కారం చూపే వివేకాలే కృష్ణ భగవానుడు. 
అంటే చేతనాచేతన మనుషుల మధ్య సంవాదమే భగవద్గీత.

గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు,
ఓడినవాడు విచారంగా ఉంటాడు, అవి రెండూ శాస్వతం కాదని తెలిసిన వాడు , నిరంతరం సుఖంగా, శాంతంగా,
సంతృప్తిగా ఉంటాడు.

*కృష్ణం వందే జగద్గురుం*

ఏ విషయం మీదా ఆసక్తి లేనివాడంటూ ఎవ్వడూ ఉండడు. ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగానే తయారవుతాడు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ ఉంటుంది అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు

యద్భావ0 తద్భవతి

జనన మరణాల మధ్య ప్రయాణం మంచి, చెడుల మధ్య సంగ్రామం, 
 ప్రేమ పంతాల మధ్య గందరగోళం, 
 ఏదో సాధించాలనే కుతూహలం ఏమీ చేయలేనేమో అనే భయం, 
 ఏదేమైనా విధాత రాసిన రాతని మార్చలేమనేది జగమెరిగిన సత్యం కానీ ఇదే మానవుని జీవిత రహస్యం

ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నమూ నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది
కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది.
భాగ్యమైన నియమ సుఖాలపై మమకారాసక్తులు లేనివాడు ఆత్మ యందే దివ్యానందాన్ని అనుభవిస్తాడు. యోగం ద్వారా భగవంతునితో ఐక్యమై, అంతులేని ఆనందాన్ని అనుభవిస్తారు 

* ఇదియే భగవద్గీత నేర్పిన నిత్య జీవిత గీతాసారం*
🙏🕉️🙏🕉️🙏🕉️🙏

దొడ్డపనేని శ్రీ విద్య
విజయవాడ
12/12/2021

0/Post a Comment/Comments