' ముత్యాల హారాలు-జీవిత సత్యాలు ' పుస్తకావిష్కరణ--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు, కవి

' ముత్యాల హారాలు-జీవిత సత్యాలు ' పుస్తకావిష్కరణ--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు, కవి

' ముత్యాల హారాలు-జీవిత సత్యాలు ' పుస్తకావిష్కరణ
--బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్. మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న, ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న వ్రాసిన 16వ పుస్తకం "ముత్యాల హారాలు-జీవిత సత్యాలు" పుస్తకావిష్కరణ ఆదోని లైబ్రరీలో   ఘనంగా జరిగింది. స్థానిక లైబ్రరీయన్ శ్రీమతి వి.పెద్దక్క ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ ఆలీమ్ సిద్ధికి ప్రిన్సిపాల్, AICA ప్రధాన కార్యదర్శి మరియు FDCA రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు, శ్రీ కృష్ణమూర్తి SI గారుల చేతుల మీదగా పుస్తకావిష్కరణ జరిగింది. అనంతరం పుస్తక రచయిత కవిరత్న గద్వాల సోమన్న ను, విచ్చేసిన అతిథులను సన్మానించారు.  తాను రచించిన పుస్తకాలను అందరికీ పంచారు. అటు విద్యాబోధన చేస్తూ.. ఇటు మాతృభాష తెలుగుకు ఇతోధికంగా సేవలందిస్తున్న గద్వాల సోమన్న ను పలువురు ప్రశంసించారు. రచయిత మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని గుర్తుచేశారు. గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  పద్యకవి ఈశ్వరప్ప, ఉపాధ్యాయులు సుధాకర్ బాబు, శ్రీ కరణం పాపన్న, వ్యాపారవేత్త జోసెఫ్, పాత్రికేయులు, లైబ్రరీ సిబ్బంది, పుర ప్రముఖులు మరియు పాఠకులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments