దేవుడన్నాడా లేడా ?
అన్నది
అనాదిగా
ఎంతకూ
అంతు చిక్కని
ఓ వింత రహస్యం
మానిషైతే ఉన్నాడుగా..!
కళ్ళకు కనిపించరు గనుక
నిర్మాణం చేసినవారు లేరనవచ్చు కానీ
తాను ప్రశాంతంగా నివసించే
ఆ గృహాన్ని మాత్రం...ఏ మనిషి లేదనలేడు..!
గృహమే నిజమైతే మరి నిర్మాత కూడా నిజమేగా
కళ్ళకు కనిపించవు గనుక
వేర్లు లేవనవచ్చు కానీ
కళ్ళముందే పచ్చగా పెరిగి
తనకు నీడనిచ్చే తన కడుపును నింపే
ఆ చెట్టును మాత్రం...ఏ మనిషి లేదనలేడు..!
చెట్టు నిజమైతే మరి వేరువేరు కాదుగా
కళ్ళకు కనిపించరు గనుక
తన తాతముత్తాతలు లేరనవచ్చు
కానీ తనకు జన్మనిచ్చిన తన కళ్ళకు
కనిపిస్తున్న తన ఎదురుగానె బ్రతికి ఉన్న
ఆ అమ్మానాన్నలను మాత్రం...ఏ మనిషి లేరనలేడు..!
ఈ అమ్మానాన్నలే నిజమైతే
మరి వారిని కన్న ఆ తాతముత్తాతలు నిజమేగా
కళ్ళకు కనిపించవు గనుక
పగటిపూట నక్షత్రాలు లేవనవచ్చు
కానీ సూర్యుడు అస్తమించగానే
ఆ నీలాల నింగిలో ప్రకాశవంతంగా
ధగధగ మెరిసే లెక్కించలేని కోటానుకోట్ల
ఆ చక్కనిచుక్కలను మాత్రం...ఏ మనిషి లేవనలేడు..!
కళ్ళకు కనిపించదు గనుక
చల్లని గాలిని లేదు అనవచ్చు కానీ
ఆ ఉచ్ఛ్వాస నిచ్వాసాల ద్వారానే
ప్రతిజీవి బ్రతికిబట్ట కట్టేది నేలమీద తిరిగేదంటే...
ఆ ఊపిరే ఆగిపోతే ఇక మనిషికి మరణమేనంటే...
ఈ భూమి మీద జ్ఞానమున్న...ఏ మనిషి కాదనలేడు..!
అందుకే
మెరిసేదంతా బంగారంకాదు
ఈ మనిషికళ్ళకు
కనిపించేదంతా నిజం కాదు
కనపడనిదంతా అబద్దం కాదు
అది
ఓ జ్ఞాననేత్రానికీ...
ఓ అన్వేషించే అంతరాత్మకే
తెలిసిన విశ్వంలోని వింతైన...
అన్నది
అనాదిగా
ఎంతకూ
అంతు చిక్కని
ఓ వింత రహస్యం
మానిషైతే ఉన్నాడుగా..!
కళ్ళకు కనిపించరు గనుక
నిర్మాణం చేసినవారు లేరనవచ్చు కానీ
తాను ప్రశాంతంగా నివసించే
ఆ గృహాన్ని మాత్రం...ఏ మనిషి లేదనలేడు..!
గృహమే నిజమైతే మరి నిర్మాత కూడా నిజమేగా
కళ్ళకు కనిపించవు గనుక
వేర్లు లేవనవచ్చు కానీ
కళ్ళముందే పచ్చగా పెరిగి
తనకు నీడనిచ్చే తన కడుపును నింపే
ఆ చెట్టును మాత్రం...ఏ మనిషి లేదనలేడు..!
చెట్టు నిజమైతే మరి వేరువేరు కాదుగా
కళ్ళకు కనిపించరు గనుక
తన తాతముత్తాతలు లేరనవచ్చు
కానీ తనకు జన్మనిచ్చిన తన కళ్ళకు
కనిపిస్తున్న తన ఎదురుగానె బ్రతికి ఉన్న
ఆ అమ్మానాన్నలను మాత్రం...ఏ మనిషి లేరనలేడు..!
ఈ అమ్మానాన్నలే నిజమైతే
మరి వారిని కన్న ఆ తాతముత్తాతలు నిజమేగా
కళ్ళకు కనిపించవు గనుక
పగటిపూట నక్షత్రాలు లేవనవచ్చు
కానీ సూర్యుడు అస్తమించగానే
ఆ నీలాల నింగిలో ప్రకాశవంతంగా
ధగధగ మెరిసే లెక్కించలేని కోటానుకోట్ల
ఆ చక్కనిచుక్కలను మాత్రం...ఏ మనిషి లేవనలేడు..!
కళ్ళకు కనిపించదు గనుక
చల్లని గాలిని లేదు అనవచ్చు కానీ
ఆ ఉచ్ఛ్వాస నిచ్వాసాల ద్వారానే
ప్రతిజీవి బ్రతికిబట్ట కట్టేది నేలమీద తిరిగేదంటే...
ఆ ఊపిరే ఆగిపోతే ఇక మనిషికి మరణమేనంటే...
ఈ భూమి మీద జ్ఞానమున్న...ఏ మనిషి కాదనలేడు..!
అందుకే
మెరిసేదంతా బంగారంకాదు
ఈ మనిషికళ్ళకు
కనిపించేదంతా నిజం కాదు
కనపడనిదంతా అబద్దం కాదు
అది
ఓ జ్ఞాననేత్రానికీ...
ఓ అన్వేషించే అంతరాత్మకే
తెలిసిన విశ్వంలోని వింతైన...
విచిత్రమైన సృష్టిరహస్యం..!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502