యేసుక్రీస్తు శుభసందేశాలు...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

యేసుక్రీస్తు శుభసందేశాలు...పోలయ్య కవి కూకట్లపల్లి...అత్తాపూర్ హైదరాబాద్

యేసుక్రీస్తు శుభసందేశాలు..

పరిశుద్ధ గ్రంథములో
ప్రభువైన యేసుక్రీస్తు
చేసిన బోధనలలో
అందించిన సందేశాలలో
కొన్ని ఆణిముత్యాలు మీకోసం

కన్నవారిని పూజించవలె...

శతృవులను ద్వేషించరాదు...

నిన్నువలె నీ
పొరుగువారిని ప్రేమించవలె...

రోగులకే వైద్యుడు అవసరం...

వెదుకుడి దొరుకును
తట్టుడి తియ్యబడును
అడుగుడి మీకియ్యబడును...

నమ్మువారి సమస్తము సాధ్యమే...

ఒకడు ఒక చెంపమీద
కొడితే మరో చెంప తిప్పవలె...

రేపేమి జరుగునో మీకు తెలియదు
గనుక రేపటి గురించి చింతించవద్దు...

ముందు నీ
కంటిలోని దూలము తీసుకో
ఆపై నీ సహోదరుని కంటిలోని
నలుసు నీకు తేటగా కనిపిస్తుంది...

ధనవంతుడు పరలోక రాజ్యములో
ప్రవేశించుట కంటే
సూదిబెజ్జంలో ఒంటెదూరుట సులభం...

ఆత్మస్వరూపులకే
పాపరహితులకే పరలోక రాజ్యప్రాప్తి.....

ఆ ప్రభువిచ్చిన
ఈ శుభసందేశాలను
చెవులు గలవారు విందురుగాక !
ఆత్మశుద్ధి గలవారు ఆచరించెదరుగాక !
హృదయశుద్ది గలవారు గ్రహించెదరుగాక !

తెలిసి చేసిన తప్పులను
తెలియక చేసిన పాపాలను
ఒప్పుకున్నవారు
మారుమనస్సు పొందినవారు
ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడని
ఆయన కలువరిగిరిపై
తన పరిశుధ్ధరక్తాన్ని చిందించి
శిలువవేయబడి మరణించి
సమాధి చేయబడి మృత్యుంజయుడై
మూడవ దినాన లేచాడని
మృత్యువు ముల్లు విరిచాడని గాఢంగా నమ్మేవారు
అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగివున్నవారు

ఖచ్చితంగా పరలోకరాజ్యంలో ప్రవేశించెదరుగాక !
ప్రభువు కుడిపార్శ్వమున కూర్చుండెదరుగాక !
ఆకలిదప్పులు మృత్యుభయంలేని
నిత్యజీవం పొందెదరుగాక !

(క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో)

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్ 

0/Post a Comment/Comments