ముత్యాల హారాలు-జీవిత సత్యాలు' పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న రచయిత

ముత్యాల హారాలు-జీవిత సత్యాలు' పుస్తకావిష్కరణ-గద్వాల సోమన్న రచయిత

'ముత్యాల హారాలు-జీవిత సత్యాలు' పుస్తకావిష్కరణ
----------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, హెచ్.మురవణి లో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న  ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న రచించిన 16వ పుస్తకం 'ముత్యాల హారాలు-జీవిత సత్యాలు'  పుస్తకావిష్కరణ విద్యార్థుల సమక్షంలో ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాసులు, ఉపాధ్యాయుల చేతుల మీద ఘనంగా జరిగింది.తెలుగు సాహిత్యానికి ముఖ్యంగా బాలసాహిత్యానికి పెద్దపీట వేస్తూ అనతికాలంలోనే 16 పుస్తకాలు రచించడమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న గద్వాల సోమన్న అందరూ ప్రశంశలతో ముంచెత్తారు.వారి తెలుగు సాహితీ కృషిని,ప్రతిభాపాటవాలను గొనియాడారు.ప్రక్రియ రూపకర్త రాథోడ్ శ్రావణ్, ఉ.సా.వే కార్యవర్గం అభినందించారు.
   ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు శివనాగజ్యోతి, జయరాజు, హస్ర ఉన్నీస బీబీ,లక్ష్మీనారాయణ, పి.శ్రీనివాసులు, రాజశేఖర్, ఆంజనేయులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments