గజల్ సిరివెన్నెల - పేరు అద్దంకి లక్ష్మి ముంబై

గజల్ సిరివెన్నెల - పేరు అద్దంకి లక్ష్మి ముంబై

పేరు అద్దంకి లక్ష్మి

ఊరు ముంబై
తేదీ19_12_21

గజల్
సిరివెన్నెల

తీయనైన రాగాలను పలికించే సిరివెన్నెల

పురివిప్పిన మయూరాలు పులకించగ నాట్యమాడె
సువాసనలు పుడమిపైన కురిపించే సిరివెన్నెల

ఈగాలీ ఈఊరూ ఈనేలా
నా దనుచును
 తేనెలొలుకు భావాలతొ యలరించే సిరివెన్నెల

జాబిలమ్మ జోలపాట కొమ్మమీద  కోయిలమ్మ అలతిఅలతి  పదాలతో ఊరించే సిరివెన్నెల

గాలివాటు  గమనానికి కాలిబాట  వేయవద్దు 
 నిగ్గదీసి అడుగమనుచు పిలుపునిచ్చె సిరివెన్నెల

మాటలతో గర్జించే ఆయుధముగ సంధించే 
చలనచిత్రపు లోకమంత కదిలించే సిరివెన్నెల

కనిపించని లోకాలకు కనుమరుగయి సీతరాము
కన్నీరే కాలువలై మిగిలించే  సిరివెన్నెల

పేరు అద్దంకి లక్ష్మీ
 ఊరు ముంబై

0/Post a Comment/Comments