గణితంతో జీవనము
వీడలేదా బంధము
అన్నిటికీను మూలము
నేర్వకుంటె శూన్యము
వారెవ్వా!గణితము
నేర్చుకొనుము సులభము.
బిందువేలె ఆద్యము
అదియేనులే స్థానము
చుట్టూరాను మనము
చేసేముప్రయాణము
గణితం నేర్చుకోండి
భవితనే మార్చుకోండి.
ప్రతి పనికి వుండు లెక్క
నీకు తెలియకుంటె లెక్క
కనిపించునుగా చుక్క
నేర్చుకొనుము ఎంచక్క
నేర్చుకుంటేను గణితము
జీవితమే సంపూర్ణము.
కె. శైలజా శ్రీనివాస్ ✍️
విజయవాడ.