జరుగుమల్లి.వీరయ్య

జరుగుమల్లి.వీరయ్య

ప్రవాహిణి వెబ్ పత్రిక ప్రచురణ కొరకు
అంశం : భగవాన్ రమణ మహర్షి
శీర్షిక : ఆత్మజ్ఞాన ప్రబోధకుడు
రచయిత :జరుగుమల్లి వీరయ్య కలికిరి, చిత్తూర్ జిల్లా,ఆంధ్ర ప్రదేశ్
చరవాణి : 8106974626
      ఆత్మజ్ఞాన ప్రబోధకుడు
ఆధునిక యుగంలో ఆత్మసాక్షాత్కారం పొందిన మహాపురుషులలో ప్రముఖుడు..
ఆత్మజ్ఞాన ప్రబోధకుడు.. భగవాన్ రమణ మహర్షి.
అరుణాచలం యందు అవతరించిన దేవా..
మౌన ముద్ర తోటి మహిమలే తెలిపి
భక్తి విశ్వాసాలే ఆయుధమని
విశ్వమానవాళికి తెలిపిన భగవాన్ రమణ మహర్షి.
మానవత్వం ఒక సముద్రం వంటిది, సముద్రం లోని కొన్ని నీటి బిందువులు
మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు, అందుచేత మానవత్వం పై నమ్మకం వదులుకోవద్దు అని తెలిపిన భగవాన్ రమణ మహర్షి.
చెడ్డవారితో స్నేహం ఎప్పటికైనా ముప్పు తెస్తుంది..
ఎప్పుడూ ఆనందం గా ఉండే వాళ్ళు విజేతలుగా నిలుస్తారు..
మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపర లో మొదటి ఆలోచన.. నేను అనునది తెలిపిన భగవాన్ రమణ మహర్షి.
ధనవంతులు గా జీవించడం కన్నా ప్రశాంతంగా జీవించడమే మేలు
స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా
మౌనంగా ఉండడమే మేలు
భగవంతునికి నీవు ఎంత దూరంలో ఉంటే..
నీకు భగవంతుడు అంతే దూరంలో ఉంటాడు.
అని తెలిపిన భగవాన్ రమణ మహర్షి.
ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు,
దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది
అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చేయలేరు..!
అతని చెడు ఆలోచనలే నాశనం చేస్తాయి..!! అని తెలిపిన భగవాన్ రమణ మహర్షి.
నీ ఆలోచనలే నీ కళ్ళు
నీవు ఎలా ఆలోచిస్తే నీ కళ్ళు అలా చూస్తాయి
మీ ఆలోచనల్లో మంచివైతే
నీ నీ కళ్ళకు అన్ని మంచివి గానే కనబడుతాయి
నీ ఆలోచనలు చెడ్డవైతే..
నీకు అన్నీ చెడ్డవిగానే కనబడుతాయి
కష్టసుఖాలను సమానంగా అనుభవించినప్పుడే..
జీవితంలో మాధుర్యం తెలుస్తుంది...!! అని తెలిపిన భగవాన్ రమణ మహర్షి.


హామీ పత్రము : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను. 

0/Post a Comment/Comments