" హితోక్తులు "-గద్వాల సోమన్న

" హితోక్తులు "-గద్వాల సోమన్న

" హితోక్తులు "
--------------------------------
అ 'స' హనాన్ని వదలాలి
సా 'హ' స పనులు చేయాలి
ఘ 'న' త కల్గి బ్రతకాలి
స 'ము' చిత స్థానం పొందాలి

ఆ 'క' లి కేకలార్పాలి
చె  'లి' మికి విలువనివ్వాలి
త  'గి' న  గుర్తింపు రావాలి
మ 'న' సులు గెలిచి నిలవాలి

మ 'మ'  తలు మెండుగ పంచాలి
అ 'ను'  మానాలు మానాలి
రో 'జు' రాజులా సాగాలి
ప 'లు' వురి మేలు కోరాలి

వా 'గె' వారిని తరమాలి
వె 'లు' గు  దారిని పోవాలి
చే 'తు' లు కల్పి నడవాలి
పే 'రు' ఊరికి తేవాలి

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,

0/Post a Comment/Comments