సినాప్సిస్ తో లోకాన
మేధావిగా పరిచయం
గణిత సిద్దాంతాలతో
తన కీర్తెంతో ఘనం
వెలికి తీసిన సూత్రాలే
చేసెను గణితాన్ని సులభం.
అయిలర్ త్రికోణమితి
నియమాల పరిష్కారం
తేలికైన పద్దతితో
గర్వించినది భారతం
వారెవ్వా రామానుజన్
అబ్బుర పరిచేను అనంతం.
పరిశోధన మేధస్సు
ప్రపంచాన వెలిగింది
కాఠిన్యతను తగ్గించి
సులభమెంతో చేసింది
అంకితభావానికి నిదర్శనమై
నిలిచేను సదా శ్రీనివాస రామానుజన్.
*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*