క్రిస్మస్ అంటే...?.... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

క్రిస్మస్ అంటే...?.... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

క్రిస్మస్ అంటే...?

మోషే ధర్మశాస్త్రము
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు
లిఖించబడిన ప్రవక్తల
ప్రవచనాల ప్రకారం....
ఆదియందు వాక్యముండెను
వాక్యము దేవుని యొద్ద వుండెను
వాక్యము దేవుడై వుండెను

ఆ దేవుడే పరిశుద్ధాత్మచే
యేసేపు మరియమ్మల గర్భఫలమై
బెత్లెహేమను పట్టణమందు
నజరేతను గ్రామమందు
ఓ పశువులపాకలో
ఓ పరిశుద్ధుడుగా ఓ లోకరక్షకుడుగా
జన్మించెనని నమ్మి క్రైస్తవులు ఆనందంతో
సంతోషంతో జరుపుకునే సంబరమే క్రిస్మస్

క్రీస్తు అంటే...?

ఒక ప్రవక్త
ఒక వైద్యుడు
ఒక బోధకుడు

ఒక అభిషిక్తుడు
ఒక పరిశుద్ధుడు
ఒక త్యాగధనుడు

ఒక ప్రేమామయుడు
ఒక పాపుల రక్షకుడు
ఒక కరుణామయుడు

ఒక మృత్యుంజయుడు
ఒక మంచి గొర్రెల కాపరి
ఒక మనుష్యకుమారుడు

ఒక దైవాంశ సంభూతుడు
ఒక మహిమా స్వరూపుడు
దావీదు మహారాజు వంశాంకురం

యేసేపు మరియమ్మల గర్భఫలం
పాపులను చేపలను పట్టు జాలరి
ఆ దేవుని అద్వితీయ కుమారుడు

క్రీస్తు భోధన ఒక్కటే....
నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించవలెనని
శతృవును ద్వేషించరాదని కన్నవారిని పూజించమని
ఆత్మస్వరూపులకే పాపరహితులకే పరలోకరాజ్యమని

(క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో)

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి అత్తాపూర్ హైదరాబాద్



 

0/Post a Comment/Comments