మద్యం ప్రియులకు
ముప్పయొకటి వేడుక
చలాన్లేప్రభుత్వానికి
మీరిచ్చే కానుక
చివరిరోజు నష్టము
మరింత కష్టము
ముప్పయొకటి వేడుక
ముగియద్దు విషాదంగ
నవవత్సర స్వాగతం
చెపుదాం సంతోషంగ
శృతిమించితే విందు
అపాయమే చెందు
మద్యం సేవించి
వాహనాన్ని నడుప
ఇవ్వలేదు సడలింపు
రాత్రివరకు గడుప
అవే వుంటయి ఆంక్షలు
దొరికితె తప్పవు రుసుములు
క్లబ్బులో పబ్బులో
రాత్రివరకు గడిపి
పోలీసుకు దొరకద్దు
వాహనాలు నడిపి
తప్పించుకోలేవు తడిపి
పొరపాటుచేయకు తెలిసి
డిసెంబరు ముప్పయొకటి
మురిపిస్తది దావత్కు
తాగిపట్టు బడితే
గురిచేస్తది ఇజ్జత్కు
ఉన్నదేదో ఇంట్లొగత్కు
లేదంటే జేబు చిత్కు
రాత్రివరకు సడలింపు
ఉందని ఉత్సాహమద్దు
తాగి వాహనం నడిపితె
చాలన్లున్టయి మరవద్దు
బుక్కైతే బురద
ముప్పయొకటి సరదా
వున్నా లేకున్న గాని
ముప్పయొకటి సరదా
ప్రభుత్వ ఖజానాకు
చేకూరే ఫాయిదా
మనకైతే దండగే
తెల్లరితే ఎండు
మనమేలుకోరి
సడలింపు ఇవ్వలేదు
పథకాలు అమలుచేయ
ఖజానా నిండిలేదు
ఒకదెబ్బకే రెండుపిట్టలు
ఆదాయంపెంచుకట్టలు
మద్యం సేవించి
వాహనం నడపవద్దు
ప్రమాదం జరగవచ్చు
వేగంగా వెళ్లవద్దు
జాగ్రత్తలు మరవద్దు
కీడు తలపెట్టద్దు.
రచన:తాళ్ల సత్యనారాయణ
హుజురాబాద్.