కవితాతూణీరము పద్యాలు

కవితాతూణీరము పద్యాలు

కవితా తూణీరము అనేపద్యకావ్యమునుండి రోజు నాలుగు పద్యాలు తాత్పర్యంతో నేనుమీముందుకు తీసుకుని వస్తున్నాను అసలు ఈపద్యకావ్యముఇలా సమాజంలోకి రావటానికి కారణం సమాజంలో నేటి స్తితి గతులను గమనిస్తూ నేనువచనరూపంలో ఐదువందలపై చిలుకు ఆలోచనలతొ ఒకనోటుబుక్కు తయారు చేశాను
అవిమొత్తము శతగ్రందకర్త కవిరాజమౌళి ఐన మానాన్న గారికి చూపినాను నీఆలోచనలు ససమాజంలోజరుగు తున్న నేటి పరిస్థితులు బాగాగ్రహించావుగనుక నీభావనలను ఈసమాజంమీదసందించే బాణాలుగా మార్చి పద్యరూపంలో పెడదామని అన్నప్పుడు నాఆనందానికి అవదులులేవు నిజంగా మానాన్న గారైన
చింతలపాటి నరసింహ దీక్షితశర్మగారి కొడుకుగా పుట్టిన నేను ఎంతటిఅదృష్టవంతుడనోకద విశ్వనాథ సత్యనారాయణ గారితో జంద్యాలపాపయ్య శాస్త్రిగారి తో కలసి నలభై భువనవిజయసభలలో ధూర్జటపాత్రపోషించిన ఆమహానుబావునికొడుకు నైనందుకు ఎంతో గర్వంగా ఫీలౌను  ప్రముఖులు బ్రహ్మానందరెడ్డి రామారావు గారు చంద్రబాబు గారు రాజశేఖర్ రెడ్డి రాష్ట్రపతి శంకర్ దయాళుశర్మ ఇంకా ఎందరో ప్రముఖ వ్యక్తుల చేత బిరుదులను సత్కారాలను అందుకొన్న మానాన్నగారు ఈసంవత్సరం
మే10వతారీకు వారి95వసంవత్సరంలో కాలంచేశారు
ఆలోటు నాకు తీరనిలోటు తెలుగు భాషకు పద్యకవితకు
ఎనలేనిలోటు నావచనాన్ని పద్యరూపంలో పెట్టిన మానాన్నగారి కృషిని ఈప్రవాహినీలో రోజు నాలుగుపద్యాలుపంపుచున్నాను కవితా అభిమానులు ఆనందిస్తారు అనినామనవి ఇట్లు చింతలపాటి పురుషోత్తమ ప్రసాదశర్మ

                   కవితాతూణీరము

1.శ్రకరములు సమస్త భాగ్యాకరములు
   భారతీపాదకంజ మంజీర రుతులు
   చేవగూర్చుత మత్కృతిశ్రీకి సరస
పద సుధా పాకరుచిర సంపద ఘటించి
తాత్పర్యం:శోభను సంపదను కూర్చినవియు సకల జనులకు సిరినిచ్చు నవియు అగువాణీదేవియొక్క పాదాల అందెల యొక్క ఘల్లు ఘల్లున మ్రోగుధ్వనులు
మంచి శబ్ధశక్తిని రససంపదను గూర్చి నాకావ్యసుందరికి మంచిమాధుర్యమును గూర్చుగాక  ఆ బలమువల్ల నాకావ్యము పండితులకు సంతోషమును కలుగజేయుగాత
2.శ్రీకరమ్ము శివుని చెలువ చూపుల చల్వ
   సాకు గాత భక్తజనుల ఘనుల
అట్టి తల్లి పదము లాశ్రయించి భజించి
మంచి యోగ మను భవించుడయ్య
తాత్పర్యం:భాగ్యమును చేకూర్చు శివుని రాణియగు దుర్గాదేవి యొక్క అందమైన కన్నుల చూపుల చలువ భక్తులను రక్షించుగాత అట్టి మాతృదేవి యొక్క పాదములను సేవించి సాటిలేని శుభ సంపదలను భక్త
జనులారా సంపాదించి సుఖించుడు
3.తల్లి తండ్రి గురువు దైవ సమానులు
    వారి పలుకు వేదవాక్కు వారి
     దీవెనలు సమగ్ర జీవనాధారాలు
     నమ్మి జీవయాత్ర నడుపుడయ్య
తాత్పర్యం:కన్న తల్లిదండ్రులను చదవు నేర్పిన గురువు గారును ప్రత్యక్షముగా కనిపించు దేవతలు వారి మాట విలువగల వేదవచనము వారి దీవనలు మన జీవనము నకు మంచి మేలు చేకూర్చు చుండును వారినమ్మి జీవితమునకు మంచి సుఖమార్గమున నడుపుకొనుడు
4.ఇద్ది నేటి చరిత్ర మీరిందు మెఱయు
దోషములగాంచి మెచ్చి సంతోషపడుటో
ఈసుపూనుటయో నిర్ణయించుకొనుడు
పీడిత ప్రజలారా వెన్కాడవలదు
తాత్ఫర్యము:ఈ కావ్యము నేటి చరిత్రను వివరించుచు
ఈనాడు జరుగుతున్న పలురకాల మోసాలను దోషాలను తెలుపును వానిని మీరు చదివి తెలిసికొని సంతోషించుడు లేదా?యీసూబూని యుండుడు సంతోషించుటో ఈసూబూనుటో మీరే నిర్ణయించుకొనుడు ఆభారమును మీపై మోపితిని
ఏమాత్రము మోమాటపడవలదు దుష్ట విషయాలకు
గురియై పీడింపబడు జనులారా వెనుకాడక ముందజవేయుడు నిజమును గుర్తించుడు

మరికొన్ని రేపు చూడగలరు




Sent from vivo smartphone

0/Post a Comment/Comments