స్వప్నకు సెలయేళ్లు

స్వప్నకు సెలయేళ్లు

కనురెప్పలు వాలి క్షణమే
ఆ రెప్పల లో అదృశ్య దృశ్య విహారాలు
మనో వల్మీకంలో ఆనందం నృత్యాలు
వేలకొలది నక్షత్రాల నడుమ
ఆషా మాలికలో
ఆశయాల మబ్బుల పై
వినిపించును మధురమైన తుంబుర గానాలు
నే  విరించినై విహరించితి ఊహాలోకాల్లో
రేపటి చీకటి తెరలను చీల్చి ఆశ లేవో అల్లుకున్న క్షణాలు నా హృదయం నిండా నిండిన ఆశల వనాలు
నన్ను ఒంటరి నైనా ఓడిపోనిమంటూ పలికెను స్వరాలు నా మనసు నిండిన వేల పూల తారలు
చుక్కల దారులను పలకరించే సందిగ్ధతకు సవాళ్ళు జాబిలి నావన  మోసుకొచ్చిన సజావుగా సమాధానాలు   గతాన్ని వెనక్కి నెడుతూ వర్తమానం వైపు అడుగులు
నా మస్తిష్కంలో జనించే స్వప్న తీరాలు
చెదిరినే  భానుని  కిరణాలు మోముపై వాలి ప్రవహించే స్వప్నపు సెలయేళ్ళు


హామీ :ఇది నా యొక్క స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.మీ ఉష

ఇడుకుల్ల గాయత్రి 


0/Post a Comment/Comments