క్రిస్మస్ తార కోరిక-గద్వాల సోమన్న

క్రిస్మస్ తార కోరిక-గద్వాల సోమన్న

క్రిస్మస్ తార కోరిక
--------------------------------
వెలసిందోయ్! తారక
వెలుగులీను హారిక
క్రిస్మస్ సమయంలో
అందమైన కానుక

ఇంటిపైన తారక
క్రైస్తవుల వాడుక
క్రిస్మస్ పర్వదినం
జగమంతా వేడుక

క్షమ,కరుణకు ప్రతీక
క్రీస్తు జనన వేడుక
క్షమాగుణం లేకున్న
అసలార్ధం  లేదిక

ప్రతీకారం చాలిక
ప్రేమ దివ్య మూలిక
అందరి క్షేమమే
క్రిస్మస్ తార కోరిక
--గద్వాల సోమన్న

0/Post a Comment/Comments