ప్రక్రియ : సున్నితం
రూపకర్త : శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
అంశము : సిరివెన్నెల సాహిత్యం
మిసిమి వెన్నెలపదములు కూర్చి
మధురగీతములతో జనులను అలరించి
ఎగసే చైతన్యస్ఫూర్తిని రగిలించె
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
విలువైన భావములను కూర్చావు
విలువలకు కట్టుబడి నిలిచావు
అక్షర సిరివెన్నెల పంచావు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
ప్రశ్నలోనే బదులు ఉందన్నావు
ఎప్పుడూ ఓటమిని ఒప్పుకోవద్దన్నావు
అలుపన్నది గుండెలయకు లేదన్నావు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
ఆదిబిక్షువు వాడినేమి కోరేదన్నావు
ప్రణవనాద ప్రకృతికి ప్రణతులిడి
ఈగాలి ఈనేలలో నిండావు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!
విలువల రహదారిలో పయనించి
కలకాలం నిలిచే గీతస్మృతినిచ్ఛి
చేరాడు దివిని సిరివెన్నెల
చూడచక్కని తెలుగు సున్నితంబు...!!!
****************************************
చంద్రకళ. దీకొండ,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా.
చరవాణి : 9381361384