Sent from
G…E…T జెట్
డా.. కందేపి రాణీప్రసాద్.
మా తమ్ముడు నా కన్నా ఏడేళ్ళు చిన్నవాడవడం నన్ను చదువులో జంప్ లు చేయించి పై క్లాసులకు త్వర త్వరగా పంపడం వల్ల వాడికి మూడేళ్ళు వచ్చి స్కూల్లో చేరే టైముకు నేను హైస్కూలు లో ఉన్నాను. కాబట్టి వాడికి చదువు చెప్పే బాధ్యత నాపై పడింది. ఆ రోజుల్లో ముందు చదువుకున్న పెద్ద పిల్లలు తరువాత చెల్లెళ్ళ కు తమ్ముళ్ళకు వాళ్ళ మాస్టర్లు. అందులోనూ మావాడు చదివేది ఇంగ్లీషు మీడియం కాన్వెంటు కాబట్టి వాడిని చదివించే పని మా అమ్మ పెట్టుకోలేదు. ఇదంతా ముప్పై ఐదు సంవత్సరాల క్రిందటి మాట. ఆ రోజుల్లోని పిల్లలు వాళ్ళ అల్లర్లు ఎలా ఉండేవో చెప్పలనిపించింది. మా తమ్ముడ్ని మేము ఇంట్లో ముద్దుగా బాబు అని పిలుచుకునేవాళ్ళం. మా రైస్ మిల్లు కావటాన మా ఆటలన్నీ దాని చుట్టూ ఒక రౌండ్ రన్నింగ్ చేసి ముందుగా ఎవరు వస్తారో అని పోటీలు పెట్టుకునేవాళ్ళం. కానీ మా తమ్ముడు మాత్రం రైస్ మిల్లు లోపలే ఆడేవాడు. బియ్యాన్ని తీసుకెళ్ళి పొట్టులో కలపడం, తవుడు, వడ్లు కలిపేయడం ఇలాంటి వన్నీ చేసి వర్కర్స్ కు ఎక్కువ పని పెట్టేవాడు. రైస్ మిల్లుకు వడ్లను టైర్ బళ్ల మీద తెచ్చేవాళ్ళు. కాబట్టి రోజు వాటిని చూసి చూసి మా వాడు నాకు బండి దున్నపోతులు కావాలనేవాడు. రోజు నల్లమట్టితో బండిని, దున్నపోతుల్ని చేసిచ్చి అటలాడించేవాడు. మా మిల్లులో పని చేసే వర్కర్ ఆ బొమ్మ బండితో చాల సంతోషంగా అడుకునేవాడు. ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియం స్కూల్లో వేయాలని మా నాన్న కుటుంబాన్ని సిటీకి మార్చేశాడు. అక్కడ కూడా దున్నపోతులు బండి కావాలని ఏడ్చేవాడు. నేను ఒక పేపరు మీద దున్నపోతులు, బండి బొమ్మ గీసిస్తే దాన్ని చూసి చప్పట్లు కొడుతూ సంతోషంగా అడుకునేవాడు. అలా వాడికి బొమ్మలు వేసివ్వటం అలవాటైన నేను, ఇంటర్ పూర్తయ్యేవరకూ వాడి రికార్డులన్నీ నేను వ్రాసేదాన్ని. ఆ తరువాత చదువంతా ఆస్ట్రేలియాలోనూ అమెరికలోనూ సాగటం వాళ్ళ వాడి రికార్డుల బాధ తప్పింది నాకు.
బాబుకు మొదట్లో సరిగ్గా పలకటం వచ్చేది కాదు. 'ఉప్మా' ను 'ఉప్నా' అనేవాడు. అమ్మా ఈ రోజు 'ఉప్నా' చేయవా అనడుగుతుంటే మా కేమో నవ్వొచ్చేది. 'బిరకాయల్ని' 'బీరకాయలు' అని పలికేవాడు. చాలా మాటల్ని ఇలాగే పలుకుతుండేవాడు. అలాగే ఒకసారి తెలుగు పుస్తకంలో బీదవాడు అంటే పేదవాడు అని అర్థం చెప్పాను. ఆ రెండింటిని కలిపి "వాళ్ళు చాల 'బెదవాళ్ళు' అనేవాడు. 'బేద వాల్లెంట్రా' అంటే బీదవాళ్ళను లేదా పేదవాళ్ళను" అని మా అమ్మ చిలక్కి చెప్పినట్లు చెప్పిన మళ్ళి అలాగే పలికేవాడు. వాడికేమో మాటలు సరిగా రక బెదవాళ్ళు, బెదవాళ్ళు అనే అంటుంటే మాకేమో నవ్వు ఆగేది కాదు.
ఇక అసలు సమస్యంతా వాడికి పాఠలు చెప్పేటపుదు వచ్చేది. What, Which, Where తో వచ్చే క్వశ్చన్ ఫార్మ్స్ అన్నీ ఒకదానికొకటి మార్చి వ్రాసేవాడు. అన్నిటికన్నా పెద్ద నవ్వొచ్చే సంఘటన ఒకటి ఇప్పటికి నవ్వు తెప్పిస్తుంది. స్పెల్లింగులు చదివిస్తూ G, E, T అని విడివిడిగా చెప్పి 'గెట్' అనాలి అని చెప్పేదాన్ని G…E…T అని అంతా అలాగే పలికి చివరకు 'జెట్' అనేవాడు. అదేంట్రా జి ఇటి గెట్ అవుతుంది ఆక్ని జెట్ ఎలా అవుతుంది సరిగా చెప్పు అని స్కేలుతో ఒకటి చేతి మీద కొట్టేదాన్ని. వాడికి జనరల్ నాలెడ్జ్ పుస్తకం ఉంది. ఇంట్లో జెమిని టి పొడి ప్యాకెట్ ఉండేది. ఈ రెండింటిని ఉదాహరణలుగా చూపి "వాటి స్పెల్లింగులు కూడా జి" తో మొదలౌతాయి. అవి చదవమంటావేంటి" అని నాతో వాదనకు దిగేవాడు. నా దగ్గర దీనికి సమాధానం లేదు. అప్పట్నుంచి 'గెట్' ఎక్కడ కనిపించినా 'జెట్' అంటూ నవ్వుకునేవాళ్ళం. ఇంగ్లిషు మీడియం కాన్వెంటు లో చదవడం వలన తెలుగు బాగా వచ్చేది కాదు. నేను తెలుగు మీడియం లో చదివాను. కాబట్టి తెలుగు పద్యాలు బాగా చదివేదాన్ని. చుట్టాలందరూ నాతో పోటీ పెట్టి అమ్మాయి కొచ్చినట్లు బాబుకు తెలుగు స్పష్టంగా పలకడం రావట్లేదని నన్ను పొగిడేవారు. అప్పుడు వాడికి ఇంగ్లిషు రాబట్టే అమెరికాలో ఉన్నాడు. నేనేమో ఇంగ్లిషు రాక ఇక్కడే ఉన్నాను.
మా బాబు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. మగపిల్లాడు కావటం మూలాన నాలాగా ఇండోర్స్ గేమ్స్ ఇష్టపడక బయటి ఆటలకు పరుగు పెట్టేవాడు. ఎండాకాలం సెలవులలో మధ్యాహ్నం పూట ఎండలో తిరిగితే వడదెబ్బ తగులుతుందని మా అమ్మ బయటికి వెల్లోద్దనేది కానీ వినేవాడు కాదు. అందుకే అందరం భోజనాలు చేశాక నిద్రపోయేటపుడు బయట గేటుకు తాళం వేసి పడుకునేది మా అమ్మ. కానీ మేము నిద్రలేచి చూసేటప్పటికి బాబు ఇంట్లో ఉండేవాడు కాదు. బయట చూస్తే పక్క సందులో గోలీలాడుతూ కనిపించేవాడు. వేసిన తాళం పేసినట్లే ఉంది ఎలా వెళ్లాడా అని అమ్మ ఆశ్చర్యపడుతుంటే "ఇలా గేటుదూకి బయటికి వెళ్ళాను" అంటూ గేటు దూకి ఎలా వెళ్ళాడో చూపించేవాడు.
మా బాబుకు తల వెంట్రుకలు తియించడానికి శ్రీశైలం వెళ్ళాం. మా అమ్మ,నాన్న, నేను అందరం కారులో శ్రీశైలం వెళ్ళాం. దేవుడి దగ్గర మేమంతా సాష్టాంగ నమస్కారాలు చేస్తుంటే తను కూడా ప్రతి చోటా బోర్లా పడుకొని దణ్ణాలు పెట్టాడు. గుడికి వెళ్ళబోతూ అమ్మ మా బాబుకి స్నానం చేయించి మంచి డ్రెస్ వేసి కూర్చోబెట్టి తను స్నానం చేయడానికి వెళ్ళింది. ఆ తర్వాత అన్ని పనులూ పూర్తి చేసుకొని వచ్చి చూసేసరికి వాడు కళ్ళు మొహం నిండా కాటుక పూసుకొని దెయ్యంలా ఉన్నాడు. ఇంతకి విషయం ఏంటంటే అమ్మ! నేను మొహానికి పౌడర్ రాసుకొని కాటుక, బొట్టు పెట్టుకోవటం గమనించి వాడు పెట్టుకోవాలని ప్రయత్నించి ఆ ఆరంలో తయారయ్యాడు. అమ్మ మరల వాడికి స్నానం చేయించి కొత్త డ్రెస్సు వేశాక గుడికి బయల్దేరం. ఇవి మా తమ్ముడి అల్లరి చేష్టలు. ప్రస్తుతం ఒక పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ గా అమెరికాలో ఉంటున్నాడు.
Mail on Android