బహుముఖ ప్రాజ్ఞాశాలి అమ్మమ్మ

బహుముఖ ప్రాజ్ఞాశాలి అమ్మమ్మ



బహుముఖ ప్రాజ్ఞాశాలి అమ్మమ్మ
                             డా.. కందేపి రాణీప్రసాద్.

అందరూ అమ్మమ్మ గురించి, అమ్మమ్మ ఊరు గురించి రాస్తుంటే నాకూ రాయాలనిపించింది. నేను టెన్త్ పాసయిన తర్వాత కలం పట్టలేదు. టెన్త్ దాకా పత్రికల్లో పిల్లల శీర్షికలకు రాయమని, బొమ్మలు వేయమని అమ్మ ప్రోత్సహించేది. అలా అన్ని పత్రికలల్లో ప్రచురితమైన వాటన్నిటిని రెండు పుస్తకాలుగా తీసుకువచ్చింది అమ్మ. నేనే కాదు అన్నయ్య ఇలా రాశాడు. మేం చిన్నప్పుడు వేసవి కాలం శెలవులకు మాత్రమే అమ్మమ్మ వాళ్ళ ఉరికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే మా వూరికి చాల దూరం. అమ్మమ్మ వాళ్ళ ఊరు ప్రకాశం జిల్లాలోని చీరాల. చీరాల పేరాల ఉద్యమం జరిగింది ఇక్కడే. ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి పేరుతో ఊరి నడిబోడ్డులో పార్క్ ఒకటున్నది. మా తాతయ్య రోజు సాయంత్రం ఈ పార్క్ కు వెళ్ళే వాడట. తాతయ్య స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నాడట గాంధీ గారిని కూడా చూశాడట. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడట. అమ్మమ్మ చెప్తుంటే నాకు చాల ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు మా తాతయ్య ఖద్దరు పంచె, లాల్చీ కండువా ధరించేవాడు. స్వాతంత్ర్యం రాక పూర్వం పాంట్లు షర్టులు వేసుకునేవాడట. స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న నాటి నుంచి ఖద్దరుకు మరీనా వాడు స్వాతంత్ర్యం వచ్చినా మరణించే వరకు ఖద్దరును విడిచి పెట్టలేదని మా అమ్మమ్మ చెపుతుంటే నాకు గర్వంగా అనిపిస్తుంది.
అమ్మమ్మ గురించి చాల చెప్పాలి. స్వాతంత్ర్య పూర్వమే అమ్మమ్మ పెళ్ళయింది. అప్పటికి ఎనిమిదేళ్ళట. పెళ్ళయాక చదువుకున్న ఆదర్శ మహిళా ఆవిడా. మరి అమ్మమ్మ ను అలా చదివించింది ఎవరనుకున్నారు? తాతయ్యే! స్వాతంత్ర్య సమారా యోధుడు కదా! గాంధీ భావాలు ఒంటబట్టించుకున్నవాడు కదా! అమ్మమ్మను పెళ్ళయాక ఎయిత్ ఫారం దాకా చదివించాడు. ఇంకా సంస్కృతం, హిందీ కూడా చదువుకుంది. కుట్లు అల్లికలు బాగా వచ్చు. మా అమ్మమ్మ ఇంటి గుమ్మానికి రెండు జింకలు మధ్యలో పూలకుండి తో కుట్టిన కర్టెన్ వేసి ఉంటుంది. అదంతా అమ్మమ్మ కుట్టిందే. ఇంకా ఇంట్లో అలాంటివి చాల ఉన్నాయి.
చీరాలలో సముద్రం దగ్గరకు వెళ్ళి ఆటలు ఆడటమంటే నాకు ఎంతో సరదా! అక్కడ ఒడ్డున పిచ్చుక గూళ్ళు కడుతూ ఉంటె అమ్మమ్మ, అమ్మ ఒడ్డున నిలిపి ఉన్న పడవల మీద కూర్చుని చూస్తుండే వాళ్ళు. ఛీరాలలోని వాడరేవు అంటే చాల ఫేమస్. ఒకప్పుడు ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు జరుగుతుండేవట. మంచి వాణిజ్య కేంద్రమట. ఇంకా అక్కడ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఐఎల్ టిడి కంపెనీ ఉంది. పొగాకును శుద్ధి చేసి ఎగుమతి చేస్తారట. అమ్మ చీరలలోని యార్లగడ్డ అన్నపూర్ణమ్మ గవర్నమెంట్ కాలేజిలో చదువుకుంది. నాన్న పెదనాన్నలందరూ విఆర్ఎస్ అండ్ వైఆర్ఎస్ కాలేజిలో చదువుకున్నారట.
అసలు అమ్మమ్మలోని మంచి క్వాలిటి గురించి చెప్పాలి. అమ్మమ్మ చాల బాగా పాడుతుంది. కొన్ని రోజులు వీణ నేర్చుకుందట. దేవుడి దగ్గర పాటలు, మంగళ హారతులు, భజన పాటలు అన్నీ పాడుతుంది. ఇవన్ని వాళ్ళ అత్తగారి దగ్గర నుంచి దేవుడి గుళ్ళోనూ నేర్చుకుందట. పిల్లల బారసాల దగ్గర్నుంచి పుట్టిన రోజు దాకా మరియు పెళ్ళిలోని ప్రతి సన్నివేశానికి తగిన పాటలు పాడుతుంది. ఇవన్ని ఒక నోట్సు లో రాసుకున్న ఆవిడకు అన్ని నోటికే గుర్తుంటాయి. ప్రతి పండుగకు సరిపడే పాటను పది పూజ చేస్తుంది. ఇవన్ని అమ్మకు కూడా నేర్పించింది. ఇంట్లో ఇద్దరూ పడుతూనే ఉంటారు. వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మమ్మ పాడే పాటలన్నింటిని పుస్తకంగా వేయాలని అమ్మ చాల రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నది.
చాల కథలు చెపుతుంది. నా చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మ బోలెడు కథలు చెప్తుండేవారు. అమ్మ రైటర్ కదా! తనకు తోటి రచయితల నుంచి పుస్తకాలు వస్తుంటాయి. వాటన్నిటిని అమ్మమ్మే ముందుగా చదువుతుంది.ఇది సులభంగా అర్థమయేలా ఉందనో, ఇది అంత కన్ప్యూజింగ్ గా ఉందనో వాటి గురించి చెప్పేస్తుంది. అమ్మ రాసినవన్నీ వింటుంది. తాతయ్య సాహితీ వేత్త సాహితీ పోషకుడు కావటం మూలాన చాల మంది పెద్ద రచయితలను చూసింది. తాతయ్యకు అన్నింటిలో తోడునీడగా ఉండేది.
మా అమ్మమ్మకు, తాతయ్యకు సాహిత్యమంటే ఇష్టం. దీన్నిఊరికే ఇష్టం అనకూడదు. ఎంతో మంది రచయితల రచనల్ని సొంత డబ్బుతో వెలుగులోకి తెచ్చారు. మా అమ్మ బారసాల దగ్గర్నుంచి పెళ్ళి వరకు ఏ శుభకార్యం జరిగినా బంధువులతో పటు రచయితల్ని ఆహ్వానించేవారు. వారి ఆశి, పద్యాలను విని సత్కరించేవారు. ఇంకా తను నిర్మించిన రైసుమిల్లుల ప్రారంభోత్సవాలకు కూడా కవులను పిలిచి ఉపన్యాసాలిప్పించేవారు. ఇంతటితో ఆపకుండా "శ్రీ అంగలకుదుటి సుందరాచారి చారిటీస్" అనే చారిటీస్ ట్రస్ట్ ను స్తాపించి దాని ద్వారా ప్రతియేటా కవులను పండితులను సన్మానించేవారు. ఇలాంటి వాతావరణంలో పెరిగిన అమ్మకు సహజంగానే సాహిత్యం అబ్బింది. అమ్మమ్మ చెప్పిన కథలన్నీ కూడా అమ్మ పుస్తకం వెయ్యలనుకుంటున్నది. సాహిత్య పరంగానూ, దేశభక్తి పరంగానూ, సంస్కృతి సంప్రదాయాల పరంగానూ ఉన్నతమైన కుటుంబం అమ్మమ్మ తాతయ్యలది. ఇలా బహుముఖంగా తెలివి తేటలున్న అమ్మమ్మ గురించి అందరికి తెలియజేయడం నాకు సంతోషంగా ఉన్నది. చీరలకు నెలవైన ఊరు, వాడరేవున్న ఊరు, చీరాల-పేరాల ఉద్యమం జరిగిన నేల మా అమ్మమ్మ గారి ఊరు చీరలను పరిచయం చేయడం నాకు గర్వకారణం. Mail on Android

0/Post a Comment/Comments