స్కిన్ లేకపోతే స్నానమెలా చేయాలి డా.. కందేపి రాణీప్రసాద్.

స్కిన్ లేకపోతే స్నానమెలా చేయాలి డా.. కందేపి రాణీప్రసాద్.




స్కిన్ లేకపోతే స్నానమెలా చేయాలి
                        డా.. కందేపి రాణీప్రసాద్.

బాల్యం అనేది ప్రతి మనిషి జీవితంలో అందమైన రంగుల స్వప్నం. ఇల్లాలు బాల్యంలో చేసే పనులను ఎంత విసిగి వేసారి పోతాయో వాళ్ళు చేసే చిలిపి పనుల వాళ్ళ అంత మాధుర్యాన్ని ఆనందాన్ని పొందుతాము. పిల్లలు లేని ఇల్లు పూలు, ఇందేలు లేని మోడు లాంటిది.
పిల్లలంటేనే ప్రశ్నలకు చిహ్నాలు. అనేక రకాల ప్రశ్నలు వేసి వాటికి మనం సమాధానం చెప్పలేక జుట్టు పిక్కోకపోతే వాళ్ళు పిల్లలే కాదు. అందులో అబ్బాయిలైతే మరీ గడుగ్గాయిలు. మాకు ఇద్దరూ అబ్బాయిలే. వాళ్ళు చిన్నతనంలో చేసిన అల్లరి పనులు ఎన్నో. వాటిలో ఓ రెండు విషయాలు మీ ముందుచుతున్నానీరోజు.
మావాడు స్కూలు కెలుతున్నా కొత్తలో జరిగిన విషయమిది. ఓరోజు క్లాసులో మావాడికి ప్రక్కనున్న పిల్లవాడికి కూర్చునే ప్లేస్ విషయంలో తగాదా వచ్చింది. ఇది నా ప్లేస్ అంటే ఇది నాప్లేస్ అని వాదించుకున్నారు. ఇంతలో ఇంటిబెల్కొట్టారు. ఇంటికి వెళుతూ ఆ పిల్లవాడు మధ్యహ్నం స్కూలుకొచ్చేటపుడు నేను మా తాతయ్యను తిసుకోస్తా, నీ పేరు చెప్తా అని బెదిరించాడట అది విని రోజూ ఎగురుకుంటూ, హుషారుగా ఇంటికొచ్చే మావాడు దిగులుగా, నీరసంగా వచ్చాడు. కామ్ గా అన్నం తింటున్నాడు గానీ రోజులా సవాలక్ష పేచీలు పెట్టడం లేదు. ఎదో ఉందనిపించింది మెల్లగా ఏంటి విషయం అని అరా తీశాను. మొత్తం విషయం చెప్పేసి గడగడా మంచినీళ్ళు తాగేశాడు. ఇంకా ఏం జరిగిందో అని భయపడ్డ నేను హమ్మయ్య అంతేకదా అని ఊపిరి పిల్చుకున్నాను. ఇక ఇప్పుడు నిదానంగా వాడికి కౌన్సిలింగ్ మొదలు పెట్టాను. "చూడు నాన్న! స్కులంటే అలాగే ఉంటుంది. ఎడిపిస్తుంటారు, బెదిరిస్తుంటారు. భయపడిపోకూడదు వాళ్ళెలా బెదిరిస్తే నువ్వు కూడా అలాగే బెదిరించాలి. అంతే కానీ ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు" అని వాతావరణాన్ని తేలిక పరుస్తూ కాస్త దైర్యం చేనుదామని ప్రయత్నించాను. కానీ పిల్ల పిడిగులు కదా! మనకన్నా ఒక అడుగు ముందే ఉంటారు. అదేనమ్మా! నేను కూడా మా తాతమయ్యను తీసుకొస్తాను అని బెదిరిద్దామనుకున్నా, కానీ మన తాతయ్య దేవుడి దగ్గరకెళ్ళిపోయాడుగా! నేనిప్పుడు తాతయ్యను స్కూలుకేలా తిసుకెళ్ళగలను! పోనీ ఓ పని చేస్తావా అమ్మా! స్కూలు కెళ్ళి వచ్చేదాకా కాసేపు పంపమని దేవుడ్ని అడుగుతావా! అన్నాడు సీరియస్ గా మొహం పెట్టి. విషయం అర్థం కావటానికి కాసేపు పట్టింది మాకందరికీ. మనమంతా ట్యూబ్ లైట్లం కదా! అర్థమయ్యాక అందరం విరగబడి నవ్వాం. వాళ్ళ ఫ్రెండ్ తాతయ్యను తీసుకొస్తాడు కాబట్టి వీడు కూడా తాతయ్యనే తీసుకెళ్ళాలి కదా! కానీ తాతయ్య లేదు కదా ఎలా అని వాడి ఆలోచన. తాతయ్య లేకపోతేనేం! మేమందరం నీకు తోడుగా ఉన్నాం అని వాడ్ని ఊరడించటానికి తాతలు దిగొచ్చారు.
అలాగే ఇంకొకసారి స్కూల్లో రేపు అందరూ హోం వర్కు చేసుకురాకపోతే 'తోలు తీస్తా' అన్నాడట మాస్టరు ఆరోజు ఇంటికి చుట్టాలు రావడంతో మావాడి హోం వర్కు మూలబడింది. తెల్లవారి నిద్రలేస్తూనే తోలు అంటే ఏమిటమ్మా అనడిగాడు. ఎందుకు అడుగుతున్నాడా అని ఆశ్చర్యపడే లోపు తనే విషయమంతా చెప్పాడు. తోలు అంటే స్కిన్ అని చెప్పాను. అంతే పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడు. 'ఏమైందిరా' అని బుజ్జగించి అడిగితే 'స్కిన్ లేకుండా ఎలా బ్రతుకుతాం! బాక్టీరియా వైరస్ లతో ఇన్ఫెక్షన్ అయి చనిపోతం కదా! అవునూ స్కిన్ లేకపోతే స్నానం ఎలా చేస్తాను? స్కూల్ డ్రెస్ ఎలా వేసుకుంటాను?" అంటూ ఇల్లు పైకప్పు ఎగిరేలా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతలి చెప్పనే లేదు కదూ! వాళ్ళ దాడి డాక్టరు. అందుకే అంత మెడికల్ పరిజ్ఞానం. మేం పై అంతస్తులో ఉంటాం. కింది అంతస్తులో హాస్పిటల్. వాడు స్కూలు నుంచీ వచ్చాడంటే హాస్పిటల్లో తిరుగుతూ అవే మాటలు మాట్లాడుతుంటాడు. అందుకే ఈ డైలాగులన్నమాట. ఆరోజు వాడిని సముదాయించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది. ఈ మాట వింటే మావాడు మరల 'తలలో ప్రాణం తోకలోకి ఎలా వస్తుంది. మనకు తోకలేదు కదా!' అంటూ ప్రశ్నలు మొదలెడతాడు. ఇక ఉంటాను. పిల్లల అల్లరిని ఇలా మరల గుర్తు చేసుకునే అవకాశం కల్పించినందుకు థాంక్స్.
 on Android

0/Post a Comment/Comments