ఉనికి. --డా.. కందేపి రాణీప్రసాద్.

ఉనికి. --డా.. కందేపి రాణీప్రసాద్.




ఉనికి
డా.. కందేపి రాణీప్రసాద్.

బాక్టీరియా, వైరస్, ఫంగస్ లాంటి అతిసూక్ష్మ జీవులన్నీ ఒక చోట సమావేశమయ్యాయి. గాలిలో తేలుతూ, చెట్లమిద ఎగురుతూ దుమ్ములో దొర్లుతూ ధూళిలో పొర్లుతూ అన్ని కూర్చుని నాయకుడి కోసం ఎదురుచూస్తున్నాయి. వాళ్ళ నాయకుడు రాగానే అన్ని లేచి నమస్కరించాయి. కాని ఎవరి మొహం లోనూ సంతోషం లేదు. చేతల్లో ఉత్సాహం లేదు. చాలా నీరసంగా ఉన్నాయి. కారణం ఏమిటని అడిగాడు నాయకుడు. "మాకు గుర్తింపు లేదు. మేమున్నామని ఎవరికీ తెలియటం లేదు. మమ్మల్ని నెట్టుకుంటూ, తొక్కుకుంటూ వెళుతున్నారు గాని మా ఉనికిన్ని గమనించట్లేదు? ఎందుకని, మాకేం తక్కువ" ఫంగస్ ముందుకొచ్చి నాయకుడికి విన్నవించింది.
అంతలో అందర్నీ తోసుకుంటూ బాక్టీరియా ముందుకొచ్చి "నాయకా! భూమ్మీద ఉన్న జంతువులన్నిటికీ మానవులు కొద్దో గొప్పో భయపడుతున్నారు. అదేమిటోగాని మాకైతే ఎవరూ భయపడటం లేదు. మమ్మల్ని నెట్టుకుంటూ, తొక్కుకుంటూ వెళుతున్నారు గానీ మా ఉనికిని గమనించట్లేదు? ఎందుకని, మాకేం తక్కువ" ఫంగస్ ముందుకొచ్చి నాయకుడికీ విన్నవించింది.
అంతలో అందర్నీ తోసుకుంటూ బాక్టీరియా ముందుకొచ్చి "నాయకా! భూమ్మీద ఉన్న జంతువులన్నింటికి మానవులు కొద్దో గొప్పో భయపతున్నారు. అదేమిటోగాని మాకైతే ఎవరూ భయపడటం లేదు. భయపడటం తర్వాత గానీ మమ్మల్నసలు గుర్తించడమే లేదు " భాధగా అన్నది.
దానికి నాయకుడు "మీరు భాదపదకండి! జంతువులన్నీ మానవుల కళ్ళకు కనిపిస్తాయి కాబట్టి వాటికి భయపడతారు.అని చేసే హాని కూడా తలుసు కదా! ఉదాహరణకు పాము కాటేస్తే చనిపోతారు. పులి పంజా దెబ్బకు ఎవరూ బతికి బట్ట కట్టలేరు. మానవులు ఈ ప్రమాదకర జంతువులకు దూరంగానే ఉంటారు" అన్నాడు.
మధ్యలో ఆవేశంగా లేచిన వైరస్ ఇలా అన్నది – "అలా కాదు నాయకా! పులి, సింహం లాంటి జంతువులు సరే. బొద్దింకలు, బల్లులకు కూడా భయపడతారు. ఆఖరికి మంచంలో ఉడే నల్లులు, తల్లో ఉండే పేలు, గాల్లో ఎగిరే దోమలక్కుడా భయపడతారు".
దానికా నాయకుడు "అదీ అయిందిలే. మైక్రోస్కోపు కనిపెట్టాక మిమ్మల్ని చూశారు. మీరు వ్యాప్తి చేసే జబ్బుల్ని వాటికి మందుల్ని కూడా కనుక్కున్నార్లే" అన్నాడు నింపాదిగా.
వైరస్ లు చాల కోపమొచ్చింది. " చూడు నాయకా! మేమెలా మానవుల్ని భయపెదతమో చూస్తుండు" అని వైరస్ లన్ని గబగబా బయటకు వెళ్ళిపోయాయి>
బయటికొచ్చిన వైరస్ లన్ని ఒక చోట గుమికుడాయి. "మనకసలు శరీరమే లేదు. అసలు జీవులో కాదో అని కూడా తెల్సుకోవటం లేదు. కాబట్టి మనమే ఎదో ఒకటి చేసి మనల్ని గుర్తించేలా చేయాలి. మన ఉనికిని నిరూపించుకోవాలి" అని మాట్లడుకున్నాయి.
ఇంతలో కరోనా వైరస్ ముందుకొచ్చింది. న"నేను ఆత్మాహుతి దాడిక్కూడా సిద్దం నేను నా డీఎన్ఏ, ఆర్ఎన్ఏ మార్చుకొని కొత్త అవతారం ఎత్తుతాను. వాళ్ళు బ్నన్ను కనుక్కునేలోపు పని ముగించుకొని వచ్చేస్తాను" అన్నది స్థిరంగా.
"భలే భలే అయితే నువ్వు ముందుకు వెళ్ళు. మేమంతా నీకు సహకరిస్తాం" అన్నాయి మిగితా సూక్ష్మజీవులన్నీముక్త కంట్టంతో.
ఆ విధంగా కరోనా వైరా "కోవిడ్ 19 " అనే అవతారమెత్తి మొదటగా చైనాలోని వుహన్ నగరానికెళ్ళింది. అక్కడి ప్రజల్ని శ్వాసకోశ ఇబ్బందులతో బాధపెట్టింది. 83,000 మందిలో ఈ వైరస్ దూరి వ్యాదిని వ్యాప్తి చేసింది. ప్రజలు బెంబేలెత్తిపోయారు. "కోవిడ్ 19" ఆనందంగా నవ్వుకుంటూ ఇటాలి, స్పెయిన్, అమెరికా దేశాలకు వెళ్ళింది. అక్కడా భానయనక వాతావరణం సృష్టించింది. అమ్మో! కరోనవైరస్ అని ప్రజలంతా భయపడటం మొదలెట్టారు. దేశాలన్నీ షట్ దౌన్ ప్రకటించి ఇళ్లకే పరిమితమయ్యారు. కోవిడ్ 19 పేరు చెప్తేనే దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇప్పుడు ఇండియాకి వచ్చింది. ఇక్కడా దాని ప్రతాపం చూపెట్టింది. ప్రపంచమంతా 'కరోనా' అనగానే వణికిపోతుంటే వైరస్ లన్నీ విరగబడి నవ్వుక్కుంటున్నాయి. అన్ని వికటాట్టహోసం చేస్తున్నాయి.
'కంటికి కనబడవు. రూపమే లేదు' అని చులకనగా చూస్తారా! మా బలమేంటో మేం చూపించాం. అతి తక్కువ సమయంలో విభజించబడుతూ ఎక్కువ వ్యాప్తి చెందగలం. ఇప్పుడు చూసు జనాలంతా ఎలా చిగురుటాకుల్లా వనికిపోతున్నారో' అంటూ వైరస్ లన్ని మానవుల్ని ఎగతాళి చేస్తూ వికృతంగా నృత్యాలు చేస్తున్నాయి. మా ఉనికిని మానవులు గుర్తించారు అనుకుంటూ వెర్రి ఆనందంతో విర్రవీగుతున్నాయి.
కాని వాటికి తెలినీ విషయమొకటుంది. తమ ఉనికిని నిరూపించుకోవటానికి పరులకు హాని చేయడం చాల తప్పు. ఒకరిని హాని చేసి వారి మరణానికి కారణం అవడం ఎంత పెద్ద నేరం. అది ఆలోచించకుండా తమ ఉనికి కోసం తప్పుడు మార్గాన్ని ఎన్నుకోవటం తప్పు. టేర్రర్రిష్టుల ఆలోచనను ఆచరించే వైరస్ లు పుట్టగతులు లేకుండా పోతాయి. "చెరపకురా చెడేవు" అన్నా సామెత ప్రకారం పరులకు ఉపకారం చెయ్యాలే గానీ అపకారం చెయ్యకూడదు.
 Mail on Android

0/Post a Comment/Comments