Story

StorySent from 
పిల్లలు బండి నడిపితే
      డా.. కందేపి రాణీప్రసాద్.
రక్తంలో ముంచి తెచ్చినట్లున్న ఒక పన్నెండేళ్ళ పిల్ల వాడిని ఆటోలో నుంచీ దింపి తీసుకువస్తున్నారు నలుగురు మగవాళ్ళు. హాస్పిటల్ లోపలి అడుగు పెడుతూనే " డాక్టర్ ఎక్కడ? డాక్టర్ ఎక్కడ? అని అరుస్తూ వచ్చారు. సృజన్ హాస్పిటల్ స్టాఫ్ కు విషయం అర్థమయింది". త్వరగా తీసుకురండి. అంటూ డాక్టర్ రూమ్ లోపలికి తీసుకెళ్ళారు నర్సులు పిల్లవాడిని ఎగ్జామినేషన్ టేబుల్ మీద పడుకోబెట్టారు.
డాక్టర్ వచ్చి పిల్లవాడిని చూస్తూ " ఏంటి యాక్సిడెంటా? ఎలా జరిగింది? అని అడిగాడు. అక్కడున్న వాళ్ళు "మేము ఆ సమయంలో ఆ రోడ్డు పై వెళుతున్నాం. వాళ్ళ అమ్మా నాన్నలకు ఫోన్ చేశాం వస్తారు ఇంకాసేపట్లో అన్నారు. రోడ్డు మీదా వెళుతుంటే ఎవరో గుద్దేసి వెళ్లి ఉంటారు. ఈ రోజుల్లో మనుష్యులను రోడ్డు మీద నడవనియ్యడం లేదు. రయ్యిమని దూసుకెళ్ళటమే వాళ్ళపని. రోజూ ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం" అన్నాడు డాక్టరు ఒకింత బాధగా.
పిల్లవాడిని తీసుకొచ్చిన వాళ్ళలో ఒకతను ముందుకొచ్చి " ఈ బాబును ఎవరూ వచ్చి డీ కొట్టలేదు. ఈ బాబే స్కూటి మీద వచ్చి డివైడర్ కు గుద్దుకొని కిందపడ్డాడు.పిల్లవాడు స్పృహ లేకుండా పడిపోయాడు అయ్యో పాపం! అని మేము మీ దగ్గరకు తిసుకువచ్చాం" అని చెప్పాడు.
డాక్టరు వీళ్ళతో మాట్లాడుతూనే తను చెయ్యాల్సిన పనులు చేస్తూనే ఉన్నాడు. పక్కనే ఉన్నా కంపౌండర్లు గాయాలన్నీ శుభ్రంగా తుడుస్తున్నారు. రక్తంతో తడిసిన బట్టల్ని కత్తెరతో కత్తిరించి తీసేశారు. ఎక్కడా దెబ్బలు తగిలాయో చూస్తున్నారు అంతలో పిల్లవాడి అమ్మా, నాన్న పరుగెత్తుకుంటూ వచ్చారు." అయ్యో చైతన్య చైతన్య కళ్ళు తెరువు " అంటూ ఏడుస్తూ వాడి మీద వాలిపోయారు. వాళ్ళ ఎడుపులకు అమ్మ అంటూ చైతన్య తెరిచి ఎడవసాగారు. " అమ్మా నా కాలు నొప్పిగా ఉంది" అంటూ కాలు పట్టుకొని ఏడుస్తున్నాడు. చైతన్య కాలు కదపలేకపోతున్నాడు.
డాక్టరు పరీక్ష చేస్తూ అనుమానపడిన విషయం చైతన్య మాటలతో బలపడింది. వెంటనే నర్సులను పిలిచి ఈ పిల్లవాడికి ఎక్స్ రే తియించుటకు రండి అని చెప్పాడు తల్లిదండ్రుల్ని పిల్లవాడి వెనకాల వెళ్ళండి అని పరమయించాడు.
కొద్ది సేపటికి ఎక్స్ రే తీసుకుని వచ్చారు. చైతన్య తల్లిదండ్రులు అందులో కాలు ప్రాక్చరయినట్లు తెలుస్తుంది మోకాలు కింద భాగంలో ఎముక విరిగింది . "దీనికి సిమెంట్ పట్టి వేయాల్సి ఉంటుంది. అని డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకేల్లండి" డాక్టరు నర్సులకు సూచించాడు.
డాక్టర్ తల్లిదండ్రులతో ఇలా అన్నాడు- కాలు ప్రాక్చర్ అయింది మిగితావి చిన్న చిన్న దెబ్బలే నాలుగు రోజుల్లో తగ్గిపోతాయి. కాలుకు పిండి కట్టు కడుతాము కదలకుండా ఆరు వారాలు అలాగే ఉండాలి. అయినా మీరసలు ఇంత చిన్న పిల్లవాడికి బండి ఎలా ఇచ్చారు. పన్నెండేళ్ళ వయసులో బండి నడపటమేమిటి. తల్లిదండ్రులు " మా అబ్బాయి చాల బాగా నడుపుతాడు ఇంకా చిన్నప్పుడే వచ్చింది. మా వీధిలో వాళ్ళంతా ఆశ్చర్యపోతారు" అని చెప్పారు ఒకింత గర్వంగా.
చూడమ్మా! ఎంత తెలివితేటలున్నా పిల్లలు పిల్లలే వాళ్ళని ప్రమాదకరమైన పనుల్లో తల దూర్చనీయకుండా కట్టడి చేయాలి. కంప్యూటర్ లాంటివి నేర్చుకుందామని ప్రయత్నిస్తే వస్తువులు పాడవుతాయి తప్ప ప్రాణాలు పోవు. ఇప్పుడు మీ అబ్బాయి డివైడర్ కు కొట్టుకొని ఉంటె ప్రాణాలు పోయేవి. ఇటువంటి ప్రమాదాలు మనమే కోని తెచ్చుకోకూడదు. గవర్నమెంట్ రూల్స్ ను పాటిస్తే మనకే మంచిది పిల్లల్ని మంచి దారిలో నడపాల్సింది తల్లిదండ్రులే. ఏ వయసులో ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. తల్లిదండ్రులుగా బిడ్డలకు మంచి చెడు చెప్పవలసిన బాధ్యత మీపై ఉన్నది". అని డాక్టరు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాడు.
 Mail on Android

0/Post a Comment/Comments