మా తాత (బాల గేయం). బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

మా తాత (బాల గేయం). బాలమిత్ర జనం కవి గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్ నెంబర్.9491387977.

మా తాత (బాల గేయం ).
-----------------------------------
నయమున ముద్దులు ఇచ్చి
రయమున బొమ్మలు తెచ్చి
బొమ్మల కొలువు మా చేత
పెట్టిస్తాడులే ఇక మా తాత !

అడుగుల భజన చేయించి
చెడుగుడు ఆటలు ఆడించి
ఆటపాటలను ఇక మాచేత
ఆడించు పాడించు మాతాత!

ఎక్కాలు బాగా వ్రాయించి
లెక్కలు ఫ్రీగా తా చేయించి
ఆ లెక్కల చిక్కులు మా చేత
తొలగించునులే ఇక మాతాత!

ఉదయం పత్రిక తెప్పించి
విధిగా వార్తలు చదివించి
పేపర్ చదివించు మాచేత
సూపర్ సక్సెస్ మా తాత !

పంచతంత్ర కథలెన్నో చెప్పుతాడు
పంచేంద్రియాల గుట్టును విప్పుతాడు
బాలవాక్కు బ్రహ్మవాక్కు అని మా చేత
అల గ్రక్కున చెప్పించునులే మా తాత !

చదువులు చెప్పే గురువుల బడికి
వరముల అందించే దేవుని గుడికీ
ప్రతినిత్యం తీసుకువెళ్ళు మాతాత
ప్రార్థన చేయించునులేఇక మాచేత!

పద బంధం పాటలు పాడించి
చదరంగం ఆటలుఎన్నోఆడించి
తర్ఫీదును అందించెను మాతాత
సంతృప్తిని పొందాను తా మాచేత!

పుస్తకాలతో చెలిమిని చేయాలంటూ
మస్తకాలతో బలిమిని మోయాలంటూ
తా చిత్రాలను వేయించును మా చేత
మా గోత్రాలను రాయించును మా
 చేత !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments