భరతమాత పిల్లలం (బాల గీతం)
-------------₹₹₹₹₹₹---------------------
భరతమాత పిల్లలం
భారతీయ మల్లెలం
దేశభక్తి వీరులం మేం
ధీయుక్తికల్గిన పోరలం!
మేము చిన్న చిన్న పిల్లలం
అల్లుకున్న పిన్న మల్లెలం
ఒక్కరికై మేము అందరం
అందరికై మేము ఒక్కరం !
మా గుండె నిండా దేశభక్తి ఉంది
మెండుగాను ధీయుక్తికి మేం బంధి
ఐఉన్నవారలం మేమంత బాలురం
ఇలా వెలిగి పోవు వీరులం ధీరులం
మా శాంతిదూత గాంధీజీ
మా క్రాంతి దాత నెహ్రూజీ
మా భరతసీమ విధాతలు
మాకు స్ఫూర్తి ప్రధాతలు. !
వీరి మాటను వేదంగా తలుస్తాం
వారి బాటలో స్థిరంగా నిలుస్తాం
స్వాతి ముత్యాల్లా వెలుగుతాం
జాతి రత్నాల్లా మేం మెలుగుతాం !
జాతీయ గీతం చదివేస్తాం
వందేమాతరం పాడేస్తాం
ప్రతిజ్ఞ పాలన పాటిస్తాం
త్రికరణ శుధ్ధిని సాధిస్తాం !
భగవద్గీతను మేం పఠిస్తాం
భరత వీరులుగ నటిస్తాం
మేం గీతాసారం బోధిస్తాం
సంగీత గానం వినిపిస్తాం !
మా భరతమాత చిట్టి పిల్లలం
మా భాగ్యవిధాత పొట్టి మల్లెలం
ఆ ప్రమోదభరితను పూజిస్తాం
ఈ భాగ్య విధాతను ప్రేమిస్తాం !
గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.