జవానుల మేం జవానులం
++++++++++++++++++-
జవానులం మేం జవానులం
మా భరతమాత గర్భమందు
జన్మించినవారలం వీరులం
అమరవీర శూరులం ధీరులం.
జవానులం మేం జవానులం
గోపాల బాల జవానులం
ఆబాలగోపాల శ్రేయస్సు మా ధ్యేయం
అవలీలగా ముగిస్తాం మా అధ్యాయం !
ప్రవాస భారతీయ వీరులం మేం
సహవాసం చేసే కార్యశూరులం
అన్యం పుణ్యం ఎరుగని పోరలం
మన్యం సైన్యం శిక్షణ ధారులం!
మా కన్నతల్లి కడుపులో పుట్టినట్టి
గట్టి ముట్టి పిండం గండం లేనట్టి
చిట్టి పొట్టి చిన్నారి పిల్లలం మేం
ఇల కాలు పెట్టినట్టి పొట్టిమల్లెలం
అయినా మాకు లేని లేదుగా
మా మదిలో ఎలాంటి చింత
ఏది ఏమైనా మేం ఆగకుండా
మా గస్తీని కొనసాగిస్తాం అంతా!
మేము భారతీయ వీరులం
మా భరతమాత పుత్రులం
పుట్టినప్పడు మేం కిసానులం
పెరిగాక అయ్యాము జవానులం !
జవానులం మేం జవానులం
వందేమాతరం జవానులం
సంధ్యవేళ గస్తీని కొన సాగిస్తాం
తెల్లవార్లు మా నిద్రకు సెలవిస్తాం!
జవానులం మేం జవానులం
మా నవయుగ జవానులం
ఈ కలియుగ జవానులం
మాఆకలి కలియుగ జవానుల !
మేమిక ఎవరికి వెరువక మా
దేశం సరిహద్దులో నిలుస్తాం
చెక చెక్ ఇక ఆ చైనా దేశం
గర్వం అణచి దాన్ని గెలుస్తాం!
మా జనం ప్రోత్సాహంత
మా కాయం ఇంధన ఉత్సాహంతో
సదా దేశం సరిహద్దులో నిలుస్తాం
యధాతదాఏ దేశాన్నైన గెలుస్తాం!
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.