మన సంక్రాంతి పండుగ. బాలమిత్ర జనం గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా .సెల్ నెంబర్9491387977.

మన సంక్రాంతి పండుగ. బాలమిత్ర జనం గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా .సెల్ నెంబర్9491387977.

సంక్రాంతి పండుగ
        --------------------------
 సంక్రాంతి పండుగ వచ్చింది
విక్రాంతిని నిండుగ తెచ్చింది
ఆనందాలను అందించింది
అనుబంధాలను పెంచింది!

సంక్రాంతి  మన సంక్రాంతి
భోగి మంటల ఈ సంక్రాంతి
సాగి వచ్చే సంక్రాంతి క్రాంతి
మమకారం మకర సంక్రాంతి !

సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి
మన సరదాల ఘన విక్రాంతి
గోగిపూల గొబ్బెమ్మలసంక్రాంతి
హరిదాసుల హారతి సంక్రాంతి !

సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి
గంగిరెద్దుల ఘనమైనసంక్రాంతి
ఎగిరే పతంగాల పవన సంక్రాంతి
గోమాయు గొబ్బెమ్మల సంక్రాంతి !

సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి
అంబరాల సరంగు సంక్రాంతి
మనరాగ సరాగాల సంక్రాంతి
ఘన సుస్వరాల సూర్య క్రాంతి !

సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి
మన విశ్వ జనుల వినోద క్రాంతి
ఘన పర్వదినం ప్రమోద క్రాంతి
జన ప్రమదవనం ప్రసార క్రాంతి !

సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి ముద్దబంతుల ముద్దు సంక్రాంతి
పొద్దు హద్దుల సద్దుల సంక్రాంతి
పాల పొంగుల పద్దుల సంక్రాంతి !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments