శీర్షిక: పల్లెపదాలు మురిసిన వేళ

శీర్షిక: పల్లెపదాలు మురిసిన వేళ

శీర్షిక: 
పల్లెపదాలు మురిసినవేళ

ఈరోజు 
పల్లెపదాల పండుగొచ్చింది
సాహితిజగాన జనపదం గెలిచినట్టుంది
పల్లెపలుకులన్ని గోరింటాకెట్టకుని 
గోరటి కలంలో సింగారంగా 
మస్తాబై మురిసిపోయాయ్
గోరటి పల్లెపదాల ఘనపాటి
కలంతో రాసినా
గొంతెత్తి పాడినా
గజ్జెకట్టాడినా
చైతన్యాన్నే పండిస్తాయ్
జనపదాల జీవితం 
జీవనగమనం
బతుకుచిత్రాలెన్నో 
సింగిడిలో రంగుల్లా 
పచ్చని పంటపొలాల్లోని పావురాలైపోతాయ్
మనసారా వరసకలిపిన పిలుపుల్లా 
పండగనాటి పిండివంటల్లా
మనసునూరిస్తాయ్
తొలకరి వర్షంతో పులకరించిన 
నేలమ్మలా
అసలుసిసలు కవిత్వానికిది అందలం
జనపదాల కవిరాజుకి గౌరవం
పుట్టుకనుండి చావుదాక మానవ నైజాన్ని 
ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తేడా ఆలోచనరేకెత్తించిన తత్వం
మారినకాలం మనిషిని దిగజార్చిన విధాన్ని
విన్న ప్రతొక్కరి మనసుల నాటుకుపోయేట్లు కవిత్వీకరణ చేసిన విశ్వనరుడే గోరటి
సామాన్యుడి ఆలోచనలకి
అసమాన్య కేంద్ర సాహిత్య
బహుమతికే సిసలైన విలువ
చెరగని చిరునవ్వూతో సమాజకాలుష్యాన్నంతా
కడిగిపారేసే కవతడు

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments