"వెన్నెలమ్మ పదాలు" పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

"వెన్నెలమ్మ పదాలు" పుస్తకావిష్కరణ -బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న

"వెన్నెలమ్మ పదాలు" పుస్తకావిష్కరణ
-బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న
------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ,ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న విరచిత 17వ, పుస్తకం "వెన్నెలమ్మ పదాలు" పుస్తకావిష్కరణ పత్తికొండ గ్రంథాలయంలో లైబ్రరీన్ శ్రీపతి ఆధ్వర్యంలో ,సత్యనారాయణ గారి అధ్యక్షతన ఘన జరిగింది.  మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా 'వెన్నెలమ్మ పదాలు' పుస్తకావిష్కరణ మండలాధికారి శ్రీ రంగస్వామి మరియు  ప్రముఖ కవి శ్రీ సవ్వప్ప  ఈరన్న గారుల  చేతుల మీద విద్యార్థుల మధ్యన ,విచ్చేసిన పుర  ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది.అచిరకాలంలోనే 17 పుస్తకాలు వ్రాసి,ముద్రించిన అరుదైన ఘనత గద్వాల సోమన్నకే దక్కుతుంది.నాణానికి బొమ్మాబొరుసులా ఒకవైపు విద్యాబోధన చేస్తూ మరోవైపు సాహిత్య సృజన చేస్తూ అందరి మన్ననలందుకుంటున్నారు.ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాకుండా పసి(డి) హృదయాలు బాలసాహిత్యం సమూహం ఏర్పాటు చేసి,బాలసాహిత్యంలో తవ వంతు కృషి చేస్తున్నారు.విద్యార్థుల మనసులను మాతృభాష వైపు అడుగులు వేస్తున్నారు.విద్యార్థులచే రచనలు చేయించి"చిట్టిచేతులు-గట్టి రాతలు" ,"హిస్సార మురవణి బడి పిల్లల కథలు "అను రెండు పుస్తక  సంకలనాలకు శ్రీకారం చుట్టారు.గణితోపాధ్యాయుడై మాతృభాషపై మక్కువతో అలతి అలతి పదాలతో అలవోకగా  కథలు,గేయాలు,పదాలు,కవితలు,వ్యాసాలు పుంఖాలపుంఖాలుగా లిఖిస్తున్నారు. అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు."వెన్నెలమ్మ పదాలు"పుస్తక రచయిత గద్వాల సోమన్న అవిరల కృషిని అందరూ అభినందించారు.
  ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో లైబ్రరీన్లు రామ్ కుమార్ ,నీరుగంటి వెంకటేశ్వర్లు, మాజీ మండలాధికారులు  లక్ష్మకాంతరెడ్డి,మాజీ సర్పంచ్ హుల్తెన్న మరియు ఖాసీం  గారులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments