సావిత్రిబాయి పూలే విశ్లేషణ

సావిత్రిబాయి పూలే విశ్లేషణ

నేడు  సావిత్రిబాయి ఫూలే జయంతి.💐సావిత్రీభాయి
జననం 3 జనవరి 1831 , నైగాన్, మహారాష్ట్ర
మరణం 10 మార్చి 1897
జాతీయత భారతీయులు
జీవిత భాగస్వామి. జ్యోతీరావ్ ఫులే
సావిత్రిబాయి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక విద్య ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.[1] కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.[2]

జీవిత విశేషాలు 

ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం.[3] తన తొమ్మిదవ యేట 22 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు.[4]

సంఘ సంస్కర్తగా

సావిత్రిబాయి ఫూలె మరియు జ్యోతిరావు ఫూలె ల విహ్రహాలు
ఆమె "జ్యోతీరావు ఫూలె" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి, దళితుల, స్ర్తీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది. ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే
     చిన్న వయసులోనే పెళ్ళి అయినా భర్త అడుగుజాడల్లో నడిచిన త్యాగమయి ఆమెఅనాటి మానువాదా ఛాయాలు పుష్కలంగా ఉన్నరోజుల్లో ఒక సంకల్పంతో అష్టకష్టాలు పాడి
నేటి తరానికిఈ అదర్శ0 సావిత్రిబాయి పూలే
ఆమె లక్ష్య0 సాధించినప్పుడే నిజమైన నీవాలి లేదా జయంతి.ఏంతో చారిత్రకల్గిన వీరు మరుగున పడ్డ నిప్పును అపలేము .ఇలాంటి వారి చరిత్రలు ఎప్పుడో ఒక్కసారి రావాలిసిందే బయటకు
    ఉమశేషారావు వైద్య
     సీవీక్స్ లెక్చరర్
కామారెడ్డి

0/Post a Comment/Comments