కొప్పుల ప్రసాద్ కు హైదరాబాదులో సన్మానం..

కొప్పుల ప్రసాద్ కు హైదరాబాదులో సన్మానం..

కొప్పుల ప్రసాద్ కు హైదరాబాదులో సన్మానం...

వాల్మీకి మహర్షి సాంస్కృతిక సేవా సంస్థ , హైదరాబాద్ వారి అనుబంధ సంస్థ అయిన వాల్మీకి సేవా గ్రూప్ ద్వారా
నిన్న జనవరి ఒకటో తేదీ డా!! వి .డి.రాజగోపాల్ గారు
రచించిన" గీతావలోకనం" మరియు "కథానికలతో.. కాసేపు" పుస్తకములు ఆవిష్కరణ సందర్భంగా, భగవద్గీత పోటీల్లో కొప్పుల ప్రసాద్ గారి కవిత ఉత్తమ కవితగా ఎంపిక అయినందుకు  మెమెంటో, శాలువా, పుష్పగుచ్ఛము తో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో వాల్మీకి కవిత గ్రూప్ అధ్యక్షులు రాజగోపాల్ గారు,పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు, హిమాలయ శివ సాయి గురువు జీ గారు, కళారత్న బిక్కి  కృష్ణ గారు, శ్రీమతి రాజావాసిరెడ్డి మల్లేశ్వరి గారు, వాల్మీకి గ్రూప్ కార్యదర్శి లయన్ ఎం. అరుణ కుమారి గారు. రిటైర్డ్ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. కొప్పుల ప్రసాద్ ను నంద్యాలకు చెందిన ప్రముఖ అభినందనలు తెలిపారు. నలంద కళాశాలల యాజమాన్యం రామ సుబ్బయ్య గారు,రామ్మోహన్ రెడ్డి గారు, ఉమా మహేశ్వర్ రెడ్డి గారు,ఏ .బి. ఎల్ రెడ్డి గారు, కళాశాలకు చెందిన లెక్చరర్స్ ,బాలాజీ విద్యా మందిర్ కరస్పాండెంట్ వెంకటస్వామి గారు, కవులు శ్రీనివాసరెడ్డి, నరేంద్ర, మహబూబ్ బాషా, అభినందించడం జరిగింది.

0/Post a Comment/Comments