" అభిలాష "
(బాలగేయం)
-------------------------------------
చేయిచేయి కలుపుదాం
చెలిమి తోడ మెలుగుదాం
సాహసం చేసేద్దాం
సమైక్యత చాటేద్దాం
గురువు వెంట నడుద్దాం
పరువు కల్గి బ్రతుకుదాం
చదువులెన్నొ చదువుదాం
సంస్కారం చూపుదాం
పిరికితనం వీడుదాం
ధైర్య గుణం పంచుదాం
తెలుగుద(ధ)నం పెంచుదాం
వెలుగు బాట సాగుదాం
మనిషితనం పొందుదాం
జగతిలోన వెలుగుదాం
దేశ ప్రగతి కోరుదాం
మొక్కలెన్నొ నాటుదాం
--గద్వాల సోమన్న