శీర్షిక: స్వేచ్ఛా భారతం
ఈ భానిసత్వభారతం
స్వేచ్ఛను పొందంగా
ఆ స్వేచ్ఛను పంచగ
వచ్చెను మనకు
జనవరి ఇరవైయ్యారు
బిన్నత్వంతో ఏకత్వం
కలదే మన దేశం
ఆ అందరి కలలు
నిజమవ్వగ
మనకొచ్చెను రాజ్యాంగం
రాజ్యాంగ రచనచేసారెందరో
మేధావులు
ఆ జ్ఞానమంతనొకటిజేసే
జ్ఞాని అంబేద్కర్
సామ్యవాదదేశమిది
సార్వభౌమ రాజ్యమిది
భారతీయులమైనందుకు
గర్వించాలందరం
భారతదేశమా
ఓ..నవగీతమా..
మనదేశ ఘనతచాట
అడుగేయాలందరం
ఐక్యతదేశమా
సమైక్యత రాగమా
ఏడేడు రంగులన్ని విరిసినట్టుగా
ఆనాటి త్యాగమే మువ్వన్నెలజెండగా
అవనిపై ఎగిరెనే నేడు
ఆ జెండే గుండెగా
దేశభక్తి నిండగా
మదిని నింపి మనమేనని సాగిపోవుమా
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.