అలిశెట్టికి నీవాళి

అలిశెట్టికి నీవాళి

అలిశెట్టి కి అక్షారం
అలిశెట్టి అక్షారం
పదునైన కత్తి
పొడి పొడి అక్షరాలతో
ఈ జగత్తు సత్యాన్ని
అవలోకనం చేసుకున్న కవి
డబ్బు కాదు అది ఒక జబ్బు అని
సామాన్యుడి బాధలను చెక్కిన
ఫోటో గ్రాఫర్
బాధ్యతల సుడిగుండంలో
పట్నం బాట పట్టిన సిటీ
లైఫ్ పేరుతో 
ఆంధ్రజ్యోతి పత్రికలో
ఓడిసి పట్టి సమస్యపై
సూటిగా పేల్చిన విస్ఫోటాలు
అతని కవితక్షారాలు
పొత్తికవితలకు ఊపిరి పోసి న
సజీవ జ్ఞాపాకాల తడి
  పుట్టుక మరణం ఒకేరోజు
యాదృచ్చికమైన  అక్షారాలే
అమరత్వాన్ని నింపినాయి
సంతకాలపై సొంత కాళ్లపై
నిలబడు
కలం లెన్స్ తో
కవితలు అల్లి
కుళ్ళు పట్టిన వ్యవస్థను
నగర జీవనం లో దాగి ఉన్న
చీకట్లను చెండా డిన
తుపాకీ గుళ్ళు
ఆయన ఒక అక్షర క్షిపణి
పుస్తకం విక్రయ ధర కూడా
ఒక్కరూపాయే ఉంచి
అందులో కూడా సామాన్యుల
మనసులోని మనిషి అయ్యాడు
వేశ్యల జీవితాలను పొత్తికవిత్వ0 లో
సముద్రమంత భావాన్ని ఒలికించిన పొత్తికవితల ఆద్యుడు
క్షయ తో మరణించిన
మరణం నా చివరి చరణం కాదు
మౌ నామ్ నా చితాభస్మం కాదు
అని నిజాన్ని చెప్పి
మరణం తర్వాత కూడా
తన అక్షారాలే అమరత్వాన్ని
కలోయించాయి నేటికి వినిపిస్తూనే ఉంటాయి
ప్రజల భాషలో సామాన్యులకు
అర్ధమయ్యే పొడి అక్షరాలా
మంత్రికా నీవు భౌతికంగా
లేకున్నా నీ అక్షారాలకు
మరణం అన్నదే లేదు
అందుకే నీవు బతికున్న అక్షారానివి
   ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి

0/Post a Comment/Comments