ఘంటశాల శ్రీమతి సత్య

ఘంటశాల శ్రీమతి సత్య


అంశం: ఘంటసాల
శీర్షిక:సంగీత భాష్యం

ఘంటసాల అద్భుత గానశాల
పడి లేచిన సంగీత కెరటం
కష్టనష్టాల్లో ఆరితేరిన వ్యక్తిత్వం
జీవితపు ఆటుపోట్లను జయించిన ధీశాలి...
సంగీత సరస్వతిని ఆరాధించి
విజయాన్ని చవిచూసిన మేధావి
అలనాటి తొలి నేపథ్య గాయకుడు ఘంటసాల
భగవద్గీతకు తన గానంతో భాష్యం చెప్పిన ఆధ్యాత్మిక యోగి
పాటే ప్రాణమై సంగీతమే సంసారమై తన గానామృతాన్ని
ప్రజలకు పంచిన గాన గంధర్వుడు
శత వర్షాలు పండుగ చేసుకుంటున్న తరుణంలో మహా గాయకుడికి మానస నీరాజనం....
మీ గానం అజరామరం
నీ వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం
తెలుగు సంగీత కళామతల్లికి మూలవిరాట్ మీరు...
అమృత తరంగిణి మీ గానం
శత వార్షికోత్సవ శుభాకాంక్షలు
మా మొర విని తెలుగునాట సంగీత కల్పవృక్షమై వెలుగుతున్న మీరు మళ్ళి మళ్ళి జన్మించాలని సంగీత సృష్టికి గాన బ్రహ్మ గా నిలవాలని ఆశిస్తూ ఆరాధిస్తూ అభినందిస్తున్నాము.....


శ్రీమతి సత్య మొం డ్రేటి హైదరాబాద్

0/Post a Comment/Comments