వెలిగే జ్యోతి(కైతికాలు)రమేశ్ గోస్కుల హుజురాబాద్.

వెలిగే జ్యోతి(కైతికాలు)రమేశ్ గోస్కుల హుజురాబాద్.

1ఆకతాయి అమ్మాయి
అందరిలో మిన్నాయే
భర్త అడుగుజాడల్లో
సామాజిక వెలుగాయే
భలే భలే సావిత్రి
భావితరాలకు వారధి
2
పసిపాప ను కాపాడ
ప్రాణమిడిచే సావిత్రి
తన త్యాగం చూసి
మురిసె ముదమార  ధరిత్రి
వారేవ్వా సంఘ సేవ
త్యాగం పరిధిని చెరిపే
3
జనమంతా చుట్టు చేరి
ఎన్ని తిట్లు తిట్టినను
భర్త అడుగుజాడల్లో
తొలి మహిళా గురు వాయెను
బడుగు జనం బ్రతుకుల్లొ
నిండు జ్యోతి లా వెలిగే
4
భర్త చదువు తుంటె చూసి
భలేగా పసిగట్టుతూ
గొప్ప వారి చరిత్ర లను
హృదిలోన నింపుతూ
జనం కొరకు జవానల్లె
జనం మధ్య చేరింది
5
సావిత్రి భాయి పూలే
మహిళల్లో మణిహారం
జాతియంత గర్వించే
జనమంతకు జయనాదం
అందుకనే సావిత్రి
అందంగా వెలిగే జ్యోతి

రమేశ్ గోస్కుల
కైతికాల రూపకర్త
హుజురాబాద్.

0/Post a Comment/Comments