నందమూరి చందమామ... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

నందమూరి చందమామ... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

నందమూరి చందమామ...!

ఆడవారే అసూయచెందే ఆరుకోట్ల ఆంద్రులఅందగాడు
అసాధారణ నటనకు...ఆత్మ గౌరవానికి ప్రతిరూపం
క్రమశిక్షణకు...సమయ పాలనకు...చెరగని సంతకం
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి చందమామ

చిత్రసీమ చరిత్రలో బాక్సాఫీస్ రికార్డులను
బద్దలు కొట్టిన మైలురాళ్ళ వంటి 290 పౌరాణిక
సాంఘిక జానపద చారిత్రక చిత్రాల్లో అద్భుతంగా
నటించిన ఆంధ్రుల అభిమాన...కథానాయకుడు
శ్రీ కృష్ణునిగా శ్రీరామునిగా పూరాణ పాత్రల్లో జీవించిన
వెండితెర మీద వెలిగిన అభినవ...అవతార పురుషుడు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి చందమామ

సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళను నినాదంతో
పేదలపార్టీ పెట్టి ఆరుకోట్ల ఆంద్రుల ఆత్మగౌరవం పేరిట
ఎన్నికల శంఖారావం...పూరించిన
కాంగ్రెస్ కంచుకోటను...ఆక్రమించిన
9 నెలల‌కాలంలో...అఖండ మెజారిటీతో
ముఖ్యమంత్రి పీఠాన్ని...అధిరోహించిన...అఖండుడు
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి చందమామ

పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన
రెండురూపాయల బియ్యం మద్యపాన నిషేధం
మహిళలకు ఆస్తిలో హక్కు పథకాలతో జనరంజకంగా పరిపాలన...అందించిన...ఘనుడు...త్యాగధనుడు
ప్రజల గుండెల్లో నిలిచిన ఆరాధ్యదైవం...అమరజీవి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి చందమామ

ట్యాంక్ బండ్ మీద కవుల నిలువెత్తు విగ్రహాలతో
తెలుగుభాషకు...తెలుగుజాతికి ఎనలేని ఖ్యాతిని
కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ను ఏర్పరచి దేశవ్యాప్తంగా
అఖండకీర్తిని ఆర్జించిన...చరిత్ర సృష్టించిన...జననేత
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి చందమామ

(శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా)

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
 
0/Post a Comment/Comments