సంక్రాంతి (బాలగేయం)-శ్రీ చాపల మహేందర్

సంక్రాంతి (బాలగేయం)-శ్రీ చాపల మహేందర్

సంక్రాంతి (బాలగేయం)
---------------------------------
సంక్రాంతి పండుగ  వచ్చెను
సంబురమెంతో హెచ్చెను
బడులకు సెలవులు తెచ్చెను
బాలల ముఖములు విరిసెను

గంగిరెద్దుల విన్యాసాలు
సరదా కోడి పందాలు
నింగిని తాకే పతంగులు
మన సంక్రాంతి సంబరాలు

ముంగిట వేసిన ముగ్గులు
మహిలో  వెలసిన తారలు
రంగవల్లిని  గొబ్బమ్మలు
పడుతుల హృదిని సంబరాలు

తెలుగువారి పెద్ద పండుగ
నింపును మోదం మెండుగ
హరిదాసుల భక్తిగానం
భువిని శోభాయమానం
-చాపల మహేందర్

0/Post a Comment/Comments