శ్రీ వాల్మీకి మహర్షి అక్షరకుసుమాంజలి పుస్తక ఆవిష్కరణ

శ్రీ వాల్మీకి మహర్షి అక్షరకుసుమాంజలి పుస్తక ఆవిష్కరణ

ఆదికవి వాల్మీకి తపస్సు చేసిన ప్రాంతం వల్మీడి గ్రామం లో శ్రీ వాల్మీకి మహర్షి అక్షర కుసుమాంజలి  సంకలనం పుస్తకం
కవి, సామాజిక వేత్త, సంఖ్య శాస్త్ర నిపుణులు, బహు పురస్కారాల గ్రహిత
 వేముల  శ్రీ వేమన శ్రీ సాయి చరణ్ దాస్ గారి సంపాదకత్వంలో వెలువడింది. 
ఈ పుస్తకావిష్కరణ సభ వల్మీడి గ్రామంలో జరిగింది. 
ఏంతో మంది ఇరు రాష్ట్రా లకు చెందిన గొప్ప కవి వర్యులు,వక్త లు, వల్మీడి గ్రామ పెద్దలు, పాలకుర్తి  జడ్పీటీసీ ఎమ్పి టి సి
జాయింట్ కలెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ వంశీ కృష్ణా లయన్స్ క్లబ్ పాలకుర్తి వారు తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమం లో గంట ఐశ్వర్య రెడ్డి గారిని తాను చేస్తున్న సాహితీ సేవకు మరియు వాల్మీకి మహర్షి పుస్తక సంకలనం లో
భాగస్వామ్యం అయినందుకు  వేముల శ్రీ వేమన  శ్రీ చరణ్ సాయి దాస్ గారు మరియు సాహితీ పెద్దలు ఐశ్వర్య రెడ్డి ని సత్కరించడం జరిగింది. 
శ్రీమతి ఐశ్వర్య రెడ్డి గారు శ్రీమతి  నెల్లుట్ల సునిత గారి అధ్యక్షతన నిర్వహిస్తున్న సాహితీ బృందావన  జాతీయ వేదిక కు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వంద కు పైగా కవులు రచయితలు పాల్గొన్నారు. 
అలాగే దీపక్ న్యాతి  గారిని, లోడే రాములు తదితర కవులను కూడా పుస్తక ఆవిష్కరణ సభలో సత్కరించారు.


0/Post a Comment/Comments