శీర్షిక: తొందరెందుకు?
గీయాల తెలంగాణాల
ఏంజేసిగని
తొందరెక్కువైంది
పరిపాలనైతే సొరగవట్టి సాగవట్టె
ఎవళ్ళకి అర్థంగాదు పర్థంగాదు
దప దప నిర్ణయాల్దీసుకుంటా
పాలనపనిజేసెటోళ్ళనంతా పరెషాన్ జేయవట్టిరి
స్థానికత అనుకుంటా ఆగమాగం జేస్తున్నరు
స్థానికతంటే అర్థంగాక
గూడిడిసిన పచ్చులైతున్నరు
ఏం సోంచాయించాలో తెల్వక జుట్టు గొకుంటున్నరు
బాధజెబుతమంటే ఇనే నాధుడే లేడాయే
చెబితెనేమో చెవుమీద పేనుబారినట్టు లేదెవ్వరికి
శంఖవూదినట్లేనాయే
దిక్కుతెల్వక దిగుల్వడవట్టిరి
ఇంతురుకులాడిస్తున్నరు
మతిలేనోడు గాడితప్పినట్లు
పెద్దకుర్సిలున్నోల్లంతా ఆటాడుతున్నరు
పాణాలెన్నిపోయినగని
జాలసలే లేదాయే
కొట్లాడి తెచ్చుకున్న సోటనే అన్యాయమా?
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.