భగవద్గీత - ఓ అక్షయపాత్ర ఓ అమృతభాండం... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

భగవద్గీత - ఓ అక్షయపాత్ర ఓ అమృతభాండం... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

భగవద్గీత - ఓ అక్షయపాత్ర ఓ అమృతభాండం

"సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాల నందనః పార్ధో
వత్స స్సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్"...

ఔను అర్జునుడే ఆవుదూడకాగ 
ఉపనిషత్తులే గోవులుకాగ
గోపాలబాలుడైన శ్రీకృష్ణ పరమాత్మ పితికి
సకల మానవాళికి అందించిన...
ఓ క్షీరధారే...ఈ గీతామృతం

పాండవుల కౌరవుల కురుక్షేత్ర రణరంగంలో
అర్జునుని రథసారథి శ్రీకృష్ణపరమాత్మ
హృదయక్షేత్రంలో ఉద్భవించిన...
ఓ అమృతభాండమే...ఈ గీతోపదేశం

ఎడారిలో ఎండమావే
నీటికొలననే భ్రాంతిని తొలిగించేది ఆత్మజ్ఞానమని
జననం లేనిది మరణం‌లేనిది మార్పులేనిది
ఆత్మే నాని ఆ ఆత్మపరమసత్యమని...
ఆ ఆత్మే పరబ్రహ్మస్వరూపమని...
ఆత్మ నిజతత్వాన్ని గ్రహించే....
ఓ తారక మంత్రమే...ఈ భగవద్గీత

సత్వ రజ తమో గుణములకు 
కర్మ భక్తి జ్ఞాన ధ్యాన మార్గములే దివ్యమైన రాజమార్గములని ఘోషిస్తున్న...
ఓ మంత్రదండమే...ఈ భగవద్గీత

సంశయాలతో సతమతమై దుఃఖాగ్నికి దగ్ధమైపోయె
సృష్టిలోని సకల జీవరాశుల సమస్యల పరిష్కారానికి
ప్రతిఫలాలను ఆశించక సకర్మలను ఆచరించవలెనని
అంతర్యామి కోటి సూర్యుల తేజోమయుడైన
ఆ పరమాత్మను పార్థునివలె దివ్యదృష్టితో
దర్శించవలెనని ప్రభోదిస్తున్న...
ఓ సుఖజీవన వేదమే...ఈ భగవద్గీత

దుష్టశిక్షణ శిష్టరక్షణ‌చేసే శ్రీకృష్ణపరమాత్మ
ధనుర్ధారి ధర్మపరాయణుడైన అర్జునుడున్నచోట
విజయాల సిరి సంపదల గుప్తనిధులుండునని
ఈ జీవితమే ప్రాపంచిక సుఖాల పరుగుపందెమని
సందేహల సమస్యల చింతల చీకట్ల విషవలయమని
ఆశ్రీ కృష్ణపరమాత్మ పదసన్నిదే
ఒక దివ్యమైన దేవాలయమని బోధించి మదినిదోచే...
ఓ మానస సరోవరమే...ఈ భగవద్గీత

చేతిగీతను
విధివ్రాతను
భాగ్యరేఖగా మార్చి
మనిషి మనిషిలో
మానవీయ విలువల్ని
మానవతాపరిమళాల్ని నింపే...
ఓ గాయత్రీమంత్రమే...ఈ భగవద్గీత

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784

 

0/Post a Comment/Comments