పూలేకు అక్షర నివాళి

పూలేకు అక్షర నివాళి

ధర్మచారి ణి
ఆమె ఒక ఉద్యమ కారిణి
 సామాజిక హితకార  ణి
భర్తబాటలో సాంఘిక అసామాన త లపై పోరు
సల్పి బడుగులకు భవితను
ఇచ్చిన ప్రేరణి
ఎందరికో అవాకాశం ఇచ్చి
విద్యాబోధన తో
స్త్రీ విద్యకు అంకురార్పణ
చేసిన విద్యమూర్తి
అది స్త్రిగురువుగా
చరితను నెలకొల్పి
కుష్టు రోగులకు సాహయం
చేసి వారి సేవాలో తరించిన
మహిమాన్విత స్త్రీ
మానువాదాపు చాయలపై
తిరుగుబాటు చేసిన
సంస్కరణోద్యమనికి  ఆధ్యం
అదే కుష్టు తో మరణించిన
నేటి బడుగుల హక్కులకు
పునాదులు వేసి
నేటి సామనత్వపు
పటిమకు స్ఫురణ
పూలే అడుగుజాడల్లో
అభ్యుదయం వైపు సాగిన
విప్లవి
నీ స్ఫూర్తి భానుడిలా ప్రకాశిస్తూ నే ఉంటుంది
బడుగు బలహీనుల బ్రాంతి
తొలిగించి కాంతి నింపే రేఖవు నీవు
నీ ఆశయాల అమలే నీకు నిజమైన నివాళి
మహిళలు బోధన వృత్తికి
మార్గం వేసిన ధీశాలి
    ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments