జరుగుమల్లి.వీరయ్య

జరుగుమల్లి.వీరయ్య

ప్రవాహాణి పత్రిక ప్రచురణ కొరకు
అంశం:సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా
శీర్షిక : అమ్మ నడిపిన  ఆత్మగౌరవ బడి
రచయిత: జరుగుమల్లి వీరయ్య.   కలికిరి కొట్టాల, చిత్తూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్.
చరవాణి : 8106974626
      అమ్మ నడిపిన ఆత్మగౌరవ బడి
భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని,రచయిత్రి ,
నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు పూలే ధర్మపత్ని,
కులమతభేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన, ప్రేమ స్వరూపిణి,
ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముఖ్తి సాధ్యపడుతుందని నమ్మిన మహిళా చైతన్య మూర్తి,
భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు,అక్షర ఆయుధం,
మహిళల కోసం మొదటి పాఠశాలను స్థాపించిన సంఘసంస్కర్త,
స్త్రీ విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి,
సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి విశేషంగా కృషిచేసిన సామాజిక మహీళాఉద్యమకారిణి,
చాందన వాదులను ఎదిరించిన ధీరవనిత... "సావిత్రిబాయి పూలే"
సావిత్రిబాయి పూలే అంటే పేరు కాదు,
ఆత్మగౌరవ పోరాట యోధురాలు,
నిమ్నవర్గాల బాలికల చదువుల తల్లి,
"ఆడపిల్లలకు చదువు వద్దు" అనే అహంకార ధోరణికి ఉప్పు పాతర వేసి
అమ్మ నడిపిన ఆత్మగౌరవ బడి
స్త్రీ చైతన్యం కోసం మహిళా మండల్ పేరుతో మరో సంచలనానికి శ్రీకారం చుట్టిన సావిత్రిబాయి పూలే..
కోటానుకోట్ల మంది ని ముందుకు నడిపించే జనచైతన్యకారిణి, ఆత్మగౌరవ పతాకం.. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ..!ఘనమైన నివాళి..!!

హామీ పత్రం : ఇది నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.


 

0/Post a Comment/Comments