" హెచ్చరికలు "-గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు

" హెచ్చరికలు "-గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు

" హెచ్చరికలు "
------------------------------
అనర్ధాలు  తెచ్చును
మితిమీరిన కోపము
జీవితాన మిగులును
అంతులేని శోకము

మోదము చేకూర్చును
గుండెలోని శాంతము
ఆపద  గొనితెచ్చును
మదిని మొండి పంతము

విషాదాన్ని నింపును
మహిని ఒంటరితనము
కెలికి కెలికి  చంపును
నిరాశ జీవితము

ఆనందమిచ్చును
ఇల్లు స్వర్గధామము
మాస్క్ లేక తిరిగిన
మిగులుతుంది భస్మము
-గద్వాల సోమన్న

0/Post a Comment/Comments