సంక్రాంతి శోభ!

సంక్రాంతి శోభ!

                             రచన : ఈరంకి... ✍️

ధనువును విడిచిన బాణంలా
సూర్యుడు మకరంలో ప్రవేశించాడు

తొలి కిరణాలు తాకిన పుడమి
ముత్యాల ముగ్గులతో మురిసింది

ముగ్గుల్లో గొబ్బెమ్మలు ముచ్చటగా
వాకిలికి అందాలు అందించి నవ్వాయి

హరిలో రంగ హరి యన్న హరిదాసు
కీర్తనలు భక్తి భావాలు రంగరించాయి

డూ డూ బసవన్న వేసేటి గంతులు 
రైతన్నకు తోడుగా  నిలిచెనన్నాయి

పంటలన్నీ ఇంట చేరిన తరుణాన
సస్యలక్ష్మి వెంట సప్తలక్ష్ములు వచ్చాయి

కొత్త అల్లుళ్లకు పిండి వంటల రుచులు
ప్రేమతోకలిసిన రుచి చూపుతున్నాయి

మంచు కురిసే మాసాన ప్రకృతిలో 
సంక్రాంతి! నవక్రాంతికి అద్దంపడుతున్నది!

( వాగ్దేవి సాహితీ వేదిక... కొరకు రాసినది )
-------------------------------------------
✍️ రచన
E.V.V.S. వర ప్రసాద్,  
తెలుగు ఉపాధ్యాయుడు,
ఊరు : తుని.
జిల్లా : తూర్పు గోదావరి
చరవాణి : 8019231180

0/Post a Comment/Comments