సర్వమతాల దేవుడు శివుడే. గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. ఫోన్ నెంబర్.9491387977.

సర్వమతాల దేవుడు శివుడే. గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూలు జిల్లా. తెలంగాణ రాష్ట్రం. ఫోన్ నెంబర్.9491387977.

సర్వ మతాల దేవుడు ఒక్కడే అని మీకు తెలుసా!- ( వ్యాసం)
-------------------₹₹₹₹₹---------------
విభిన్న దేశకాల  పరిస్థితుల్లో అధర్మం పెరిగి ధర్మం క్షీణించినప్పుడు ఆ భగవంతుడు  సిద్ధ గురువులను భూమిపైకి పంపించి  ధర్మాన్ని పునరుద్ధరించు టకై ఆదేశించగా, వారి వలన భవించిన వే వివిధ మతాలు. విభిన్న మతాల సిద్ధ గురువులు అనేకం. విభిన్న మతాల లోకాలు అనేకం. కానీ  ఆ విభిన్న మతాల దేవుడు మాత్రం ఒక్కడే. అతడే పరమశివుడు.
           నదుల అన్నింటికి సముద్రము రారాజు. మృగాల అన్నింటికీ సింహము రా రాజు. గ్రహాల అన్నింటికీ సూర్యుడు రారాజు అయినట్లు సర్వదేవతలకు, సర్వ లోకాల ప్రభువులకు, దేవదేవుడు ఆ శివుడే. విశ్వములో  హైందవ మతం, యూదుమతం, ఇస్లాం మతం, జైన మతం, జోరాస్ట్రియన్ మతం, క్రైస్తవ మతం, బౌద్ధమతం, సిక్కుమతం ఇలా ఎన్నో మతాలు ఉన్నాయి. మతాలు ఎన్ని ఉన్నా దేవుడు మాత్రం ఒక్కడే. అతడే శివుడు. ఆయా మతాల వారు వారి మతాల లో వేరే వేరే పేర్లు ఉపయోగించినా, అవి శివుని నామధేయము లే.
మతము.                పేరు
------------.             -------------
హైందవ మతం.       శివుడు.
జోరాస్ట్రియన్.     అహురామజదా
లేదు మతం.         జహోవా
క్రైస్తవ మతం.  పరలోకపు తండ్రి
ఇస్లాం మతం. అల్లాహ్.
బౌద్ధమతం.     శూన్యం.
జైన మతం.       మోక్ష.
సిక్కుమతం.        హరుడు.
మెక్సికో మతం...     క్విట్.కాట్లో.
చైనా మతం.          పాన్ కు
స్కాండినేవియా.    ఈ మీర్
బాబిలోనియా.       అట్లాటెంట్లే.
ఈజిప్టు మతం.      ఖ్నుపూ.
     కీర్తించినా, ప్రార్థించినా, ప్రతిపాదించిన ఆ దేవుడు ఒక్కడే.
అతడే శివుడు. అందుకే బాలగంగాధర్ తిలక్ అందరి దేవుడు ఒక్కడేనని బోధించాడు. పంచభూతాలు  అందరికీ ఒక్కటే అయినప్పుడు డు, ఆ పంచభూతాలను సృష్టించిన దేవుడు అనేకం ఎలా అవుతాడు?
ఇదే మనిషి యొక్క అజ్ఞానం. అవివేకం. కాబట్టి దేవుడు ఒక్కడేనని గ్రహించు. అతడే పరమశివుడు అని భావించు. ఇట్టి శివుడిని పూజించి తరించు.
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments