సాటిలేని మేటినామం శివ నామం. (వ్యాసం). గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. సెల్ నెంబర్.9491387977.

సాటిలేని మేటినామం శివ నామం. (వ్యాసం). గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. సెల్ నెంబర్.9491387977.

సాటిలేని మేటి నామం శివ నామం!(వ్యాసం)....... గుర్రాల.
---------------₹₹₹₹₹₹₹----------------
"సంసార వ్యాధి భేషజం అనంత దుఃఖ శమనం శివ ఇత్యక్షరద్వయం"అని అని పురాణ ఉవాచ.
జనన మరణములనే సంసార వ్యాధికి అనంత దుఃఖాన్ని తొలగించే దివ్యౌషధనామం శివనామమని భావార్థం. ఈ సృష్టిలో సాటిలేని అత్యంత మహిమాన్వితనామం శివ నామం. యావత్ ప్రపంచంలో సర్వ శ్రేష్టమైన పరమోన్నత నామం ఒక్క శివ నామమే. ఈ పరమ రహస్యం శివానుగ్రహం పొందిన పుణ్యాత్ములకు మాత్రమే అవగతమౌతుంది . కాని అందరికీ అవగతమయ్యే ది మాత్రం కాదు. శివనామ ప్రభావాన్ని, వైభవాన్ని ఆ బ్రహ్మ ,విష్ణు, రుద్రులుకూడా సంపూర్ణంగా వర్ణించలేదు. కీర్తించ లేదు. శివ నామం అంతటి మహత్తరమైనది.
పరాశక్తి అహర్నిశలు తలచే నామము శివ నామమే. సర్వ దేవతలు, సకల మునీశ్వరులు, మరియు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నిరంతరం జపించే నామం ఒక్క శివ నామమే.
బ్రహ్మ, విష్ణు, రుద్ర, శ్రీకృష్ణ, శ్రీరామ,
విష్ణు నామాల కన్న శివ నామమే
మిన్న అని, సర్వ శ్రేష్ట నామమని 10 పురాణములు, 84 ఉపనిషత్తులు ఎన్నో శాస్త్రాలు, ఇతిహాసాలు మరీ వివరించి చెప్పాయి.
కాలదోషం పట్టిన పురాణాల, శాస్త్రాల ఆధారంగా గాక ప్రత్యక్షంగా ఆ శ్రీరామచంద్రుడు లోక సాక్ష్యం లతో తన దివ్య జీవిత ఆచరణ ద్వారా శివ నామము సర్వ శ్రేష్ఠమైనదని నిరూపించి చూపించాడు. కాబట్టి చక్కగా అందరూ రూ శివ నామాన్ని జపించి నిత్యం స్మరించండి. తరించండి.
ఓం నమశ్శివాయ! ఓం నమశ్శివాయ!!.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూలు జిల్లా.

-

0/Post a Comment/Comments