మా పసిపాప.(బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

మా పసిపాప.(బాల గేయం). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా . తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్ 9491387977.

మా పసిపాప (బాల గేయం)
      -------------------------------------
ఓపాపాయి! మా పసిపాపాయి
ఆగూట్లోనే ఉందిలే నీ రూపాయి
తీయలేదులే ఆరూకను ఎవరు ?
ఎవరికీ లేదులే తీసుకునే పవరు !

మా పాపాయి! ఓ పసి పాపాయి
ఏడువకు నీవు ఓ మా శివసాయి
ఏడిస్తే నిన్నెవరుగూడఎత్తుకోరమ్మా
గునిస్తే గుండెకు ఇక హత్తుకోరమ్మా!

ఓ పాపాయి మా పసిపాపాయి
నీ నిద్దురనుండి నీవిక లేవోయి
అందుకో నీ బ్రాండ్ ఈసోపోయి
ముందుగానే చేసుకో నీ సోకోయి!

పుస్తకాల సంచి ఇక సంకనేసుకో
మస్తకాన్ని వంచి  నీవు చూసుకో
శీఘ్రంగా నీ బడిబాటను పట్టుకో
నిగ్రహంగ ఆగుడిలో కాలు పెట్టుకో!

భక్తితో గురువుల నీవు పూజించు
అనురక్తితో భారతినిక ధ్యానించు
అంతా మనవాళ్ళేని ఇక భావించు
చింతే లేకుండా ఇక నీవు జీవించు !

నీవు పట్టిందల్లా కావాలి పాపాయి
పుత్తడి బంగారం మాపసిపాపాయి
పొద్దు పోయే వరకు నీవు చేయొద్దు
హద్దు మీరిన జాగారం ఇక నీవోయి 

మంచి చెడులను తెలుసుకుని
మసలు కుంటేనే ఇక సింగారం
బతుకంతా ఔతుందిక బంగారం
వినుకో ఓపసిపాపాయి నీవోయి !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments