ప్రియమైన "పుస్తకాలు"--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు.

ప్రియమైన "పుస్తకాలు"--గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు.

ప్రియమైన "పుస్తకాలు"
-----------------------------
విజ్ఞానమే పంచును
అజ్ఞానమే త్రుంచును
నేస్తమా!! పుస్తకాలు
ప్రజ్ఞ మెండుగా పెంచును

వికాశ కేంద్రాలు
వినోద క్షేత్రాలు
నేస్తమా! పుస్తకాలు
ఆనంద నిలయాలు

వెల్లడించు విషయాలు
పల్లవించే రాగాలు
చల్లని సందేశాలతో
కొల్లగొట్టు హృదయాలు

కాంతులీను దీపాలు
శాంతినొసగు పుస్తకాలు
భ్రాంతిని తరిమే మదిని
సంక్రాంతి సంబరాలు

అమూల్యమైన సిరులు
ఆరోగ్య ప్రదాతలు
అవనిలో పుస్తకాలు
ప్రియమైన నేస్తాలు

పుస్తకాలు చదవాలి
మస్తకాలు వెలగాలి
నేస్తమా! పుస్తకాలే!!
హస్త భూషణమవ్వాలి
--గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments